కరోనా వైరస్ దెబ్బకు తెలంగాణాలో జరుగుతున్న 10వ తరగతి పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. ఇప్పటికే మూడు పేపర్లు అయిపోయినా కోర్టు ఆదేశాల వల్ల పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేయాల్సొచ్చింది. దీని వల్ల లక్షలాది మంది విద్యార్ధులకు ఇబ్బందులు తప్పేలా లేదు. శనివారం జరగాల్సిన సెకండ్ ల్యాంగ్వేజ్ పరీక్ష అంటే హిందీ కావచ్చు లేదా తెలుగు కావచ్చు మాత్రమే జరుగుతుంది. మిగితా పరీక్షలన్నీ కోర్టు ఆదేశాలతో వాయిదా పడినట్లే.

 

23వ తేదీ నుండి జరగాల్సిన అన్నీ పరీక్షలను రీ షెడ్యూల్ చేయలని కోర్టు శుక్రవారం జరిగిన విచారణలో ఆదేశించింది.  నిజానికి అసలు పరీక్షలు మొదలయ్యేదే అనుమానంగా మొదలైంది. పదవ తరగతి పరీక్షలు యథాతధంగా జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించటంతో నాలుగు రోజుల క్రితం పరీక్షలు మొదలయ్యాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కరోనా వైరస్ బాధితులు పెరుగుతుండటంతో ప్రభుత్వంలో కూడా పునరాలోచన మొదలైంది. ఇంతలోనే ఎవరో సామాజిక కార్యకర్త న్యాయస్ధానాన్ని ఆశ్రయించటంతో ప్రభుత్వం పని సులువైంది.

 

మొత్తం మీద లక్షలాది మంది విద్యార్ధుల్లో కొందరు సంతోషం వ్యక్తం చేస్తుండగా మరికొందరు మాత్రం తెగ బాధపడిపోతున్నారు.  పరీక్షలకు బాగా ప్రిపేర్ అయిన విద్యార్ధులంతా పరీక్షల వాయిదాను వ్యతిరేకిస్తున్నారు. కాకపోతే చేసేదేమీ లేదు కాబట్టి మాట్లాడకుండా కూర్చుంటున్నారు. మొత్తానికి కరోనా వైరస్ ఇది అది అని లేకుండా ప్రతి రంగాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తోంది.

 

ఇప్పటికే ఐటి రంగంపై వైరస్ దెబ్బ ఎంత తీవ్రంగా ఉందో అందరూ చూస్తున్నదే. కరోనా వైరస్ సోకుతుందన్న భయంతోనే కాలా కంపెనీలు ముందు జాగ్రత్తగా తమ ఉద్యోగులను ఇళ్ళ నుండే పనిచేయమని ఆదేశించాయి. మరి కొన్ని కంపెనీలు కరోనా సోకిందనే అనుమానం ఉన్న ఉద్యోగులకు శెలవులు ఇచ్చేసి ఇళ్ళకు పంపేశాయి. అలాగే ప్రభుత్వం కూడా పబ్లిక్ ప్లేసెస్ అంటే రెస్టారెంట్లు, సినిమా హాళ్ళు, షాపింగ్ మాళ్ళు, పబ్ లు లాంటి వాటికి మూసేసిన విషయం అందరికీ తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: