కరోనా వైరస్ చైనాలో అల్లకల్లోలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరస్ ఆ దేశంలోనే మొదలయ్యి, ప్రపంచ దేశాలకు పాకింది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి చైనా దేశంలో వేలమంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా వేలల్లో ప్రజలు వైరస్ బారిన పడ్డారు. ఈ క్రమంలోనే ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చైనా వేగంగా చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఈ వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో కీలక పాత్ర పోషించే మాస్కుల తయారీలో చైనా సరికొత్త రికార్డు సృష్టించింది.

 

చైనాలోనే కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉండటంతో, ఆ దేశంలో మాస్కులకు విపరీత డిమాండ్ వచ్చింది. ప్రజలకు తగినంత స్థాయిలో మాస్కులు అందించలేకపోయారు. ఈ క్రమంలోనే  చైనా మాస్కుల ఉత్పత్తిని మరింత పెంచింది. ఇక రోజుకు 44.9 మిలియన్ల మాస్కులు తయారు చేసిందని నేషనల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రిఫార్మ్‌ కమిషన్‌ ప్రశంసలు కురిపించింది.

 

అయితే షెంజెన్‌లో ఉన్న బీవైడీ కంపెనీ అధిక స్థాయిలో ఈ మాస్కుల తయారు చేసి రికార్డు సృష్టించింది. ఆ కంపెనీ రోజుకు 5 మిలియన్ల మాస్కుల తయారీతో అతిపెద్దగా సంస్థగా అవతరించింది. ఇక ఈ మాస్కులతో పాటు రోజూ మూడు లక్షల వైరస్‌ని అరికట్టే ద్రావణం బాటిళ్లు తయారీ చేసింది.

 

అసలు చైనాలో మూడోవంతు మాస్కులు బి‌వై‌డి కంపెనీలోనే తయారవుతున్నాయి. బి‌వై‌డి సంస్థ దాదాపు 3 వేల మంది ఇంజనీర్లతో, అందుబాటులో ఉన్న వనరుల సాయంతో రెండు వారాల్లోనే ప్రజల డిమాండ్‌ని బట్టి మాస్కులు తయారు చేశారు. కాగా, కరోనా వైరస్ చైనాలో నిదానంగా తగ్గుముఖం పడుతుంది. కొత్తగా వైరస్‌ బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకూ తగ్గుముఖం పట్టింది. గత వారం రోజులు నుంచి అక్కడ కరోనా మరణాలు కూడా తగ్గుతూ వస్తున్నాయి. ఏదేమైనా చైనా దేశం కరోనా వైరస్ ప్రభావాన్ని చాలావరకు అడ్డుకోగలిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: