ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కలకలం సృష్టిస్తుంది.  ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని రీతిలో ఏ వైరస్ సృష్టించని భయాందోళన ఈ కరోనా వైరస్ సృష్టిస్తుంది.  మరీ దౌర్భాగ్యం ఏంటంటే ఈ కరోనాకు యాంటీ డోస్ ఇప్పటి వరకు కనిపెట్టలేదు.  ప్రస్తుతం కరోనా సోకకుండా మనిషి జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలని చెబుతున్నారు.  అయితే హ్యాండ్ వాష్ వెనుకు ఓ విషాద గాధ ఉంది.  ఈ నేపథ్యంలో గూగుల్  ఈ రోజు తన డూడుల్‌లో చేతులు ఎలా శుభ్రం చేసుకోవాలో ఓ వీడియోలో వివరించింది. ఇక హ్యాండ్ వాష్ గురించి వందేళ్ల క్రితమే సూచించిన హంగేరీ డాక్టర్ ఇగ్నాజ్‌ సిమెల్వెస్‌ను స్మరించుకుంది.

 

 అయితే, చేతులు కడుక్కోవాలని చెప్పినందుకు పిచ్చోడి ముద్ర వేసి చివరకు సిమెల్వెస్‌ను దారుణంగా కొట్టి చంపారు అప్పటి అజ్ఞానులు. సిమెల్వెస్ 1847లో సరిగ్గా ఇదే తేదీన వియాన్నా జనరల్ ఆసుపత్రిలో మెటర్నిటీ క్లినిక్‌లో చీఫ్ రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారు.  ఆయన బాధ్యతలు స్వీకరించిన సమయానికి  ‘చైల్డ్ బెడ్ ఫీవర్’ వల్ల తల్లులు ఎక్కువగా చనిపోయేవారు. దీనిపై పరిశోధన చేసిన సిమెల్వెస్  డాక్టర్లు, నర్సులు క్లోరినేటెడ్ లైమ్ సొల్యూషన్స్‌తో  చేతులు శుభ్రం చేసుకుంటే మరణాలు తగ్గుతాయన్నాడు. అయితే ఈ విషయం సిమెల్వెస్‌ శాస్త్రీయంగా నిరూపించే సమయం ఆయనకు దక్కలేదు. దాంతో సిమెల్వెస్‌ తన చుట్టు ఉన్న సిబ్బంది వెక్కిరించడం మొదలు పెట్టింది.. కొంత కాలానికి మెడికల్ ఫీల్డ్ ఆయణ్ణి వెలేసింది.  

 

దాంతో ఆయన మానసికంగా కృంగిపోయారు.. ఎప్పుడూ చైల్డ్ బెడ్ ఫీవర్ గురించే మాట్లాడటంతో అతనికి పిచ్చి పట్టిందని పిచ్చివాడని ముద్ర వేశారు.  ఓ మెంటల్ హాస్పిటల్ లో గొలుసులతో కట్టేశారు. చివరికి 1865లో గార్డులు కొట్టిన దెబ్బలకు ఆయన చనిపోయారు. అయితే సిమెల్వెస్  చనిపోయిన 20 ఏళ్ల తర్వాత లూయీపాశ్చర్ ‘జెర్మ్ థియరీ’, జోసెఫ్ లీస్టర్ ‘హైజీనిక్ మెథడ్స్’ను శాస్త్రీయంగా నిరూపించారు. మనం కొన్ని వస్తువులు ముట్టుకోవడం వల్ల వైరస్ ఎటాక్ అవుతుందని.. వివిధ వైద్య పరికాలు, చేతుల ద్వారా రోగులకు ఇన్‌ఫెక్షన్స్‌ వస్తాయని రాబర్ట్ కోచ్ అనే మరో శాస్త్రవేత్త  కూడా తేల్చారు. అప్పటి నుంచే  సిమెల్వెస్ ‘హ్యాండ్ వాషింగ్ మీజర్స్’ను అందరూ ఒప్పుకున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: