కరోనా వైరస్ ప్రపంచంలో కలకలం రేపుతోంది. ఈ వ్యాధితో ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. కరోనా వైరస్ తో ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది చనిపోయారు. కొన్ని లక్షల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి తొందరగా వ్యాప్తి చెందటంతో అన్ని దేశాల ప్రభుత్వాలు తగు చర్యలు చేపట్టారు. 

 

ఈ వ్యాధి వలన ఇప్పటికే ఆర్థికంగా చాల నష్టపోయింది. ఈ వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందడంతో విదేశీ రాకపోకలను కూడా ఆపివేశారు. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు తీసుకొచ్చి వారిని ఐసోలేషన్ వార్డులో ఉంచి వైద్యం అందిస్తున్నారు. మన దేశంలో కూడా ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతుంది. దింతో సినిమా థియేటర్లను, పాఠశాలలను అన్నిటికి ప్రభుత్వం సెలవులు ప్రకటించారు.

 

దేశంలో ఇప్పటికే చాలా కంపెనీలు వారి యాజామాన్యానికి వర్క్ ఫ్రొం హోమ్ ఇచ్చి ఆఫీస్ కి సెలవులు ప్రకటించారు. రిటైల్‌ దుకాణాలలో పనిచేసేందుకు లక్షమందికి పైగా కార్మికులను నియమిస్తామన్నారు. దీనికి సంబంధించిన వివరాలను రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ తెలిపింది.

 

కొత్తగా నియమించే ఉద్యోగులకు కంపెనీ వరాల జల్లు కురిపిస్తూ ప్రకటన జారీ చేసింది. పూర్తి సమయం పనిచేసే కార్మికులకు 300 డాలర్లు, తాత్కాలికంగా పనిచేసే కార్మికులకు 150 డాలర్ల బోనస్‌ ప్రకటించాలని కంపెనీ భావిస్తోంది. కార్మికల నియామకాలను మే చివరి నాటికి పూర్తి చేస్తామని వాల్‌మార్ట్‌ ప్రకటనలో పేర్కొంది.

 

ఈ కంపెనీలో కొత్తగా విధుల్లో చేరిన కార్మికులు రిటైల్‌ స్టోర్స్‌, క్లబ్స్‌, పంపిణీ కేంద్రాల్లో విధులను నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలను కంపెనీ ప్రకటించింది. వినియోగదారులకు అత్యుత్తమ సేవలను అందించే విధంగా ఈ నియామకాలను చేపడతామన్నారు.

 

వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవడానికి కార్మికులను తీసుకున్నట్లు ఆ కంపెనీ సీఈఓ డగ్‌ మెక్‌మిలన్‌ పేర్కొన్నారు. ఆహార, పరిశుభ్రతను పాటించడంలో భాగంగా అదనపు సిబ్బందిని నియమిస్తున్నామని వాల్‌మార్ట్‌ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: