ప్రస్తుతం భారత దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ ప్రభావం పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా వైరస్  విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా  పాజిటివ్ కేసులు పెరిగిపోతుండడంతో తెలంగాణ ప్రజానీకంలో ప్రాణభయం పట్టుకుంది. ఏం చేస్తే కరోనా వైరస్  సోకుతుందో అనే  ప్రాణభయంతో బతుకుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అప్రమత్తం అయిన విషయం తెలిసిందే. కరోనా  వైరస్ నియంత్రణకు కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. అయితే ఎన్ని కఠిన నిబంధనలు అమలులోకి తీసుకు వస్తున్నప్పటికీ రోజురోజుకు కరోనా  పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం పెరిగిపోతోంది. ప్రస్తుతం కరోనా  సోకిన వారందరూ గాంధీ ఆస్పత్రిలో ఐసొలేషన్ వార్డులో  చికిత్స అందుకుంటున్నారు. 

 

 

 ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 16 కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా మరో రెండు కరోనా  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇలా రోజురోజుకు కరోనా  పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో తెలంగాణ ప్రజల్లో  ప్రాణభయం మరింతగా పాతుకుపోయింది. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రతి చోటా కరోనా  వైరస్ ప్రభావం కనిపిస్తుంది. ఎప్పుడూ రద్దీగా ఉండే రహదారులు  ప్రస్తుతం జనాలు లేక వెలవెల బోతున్నాయి. అంతే కాకుండా ఇప్పటికే కరోనా వైరస్ ను నియంత్రించేందుకు తెలంగాణ సర్కార్ విద్యాసంస్థలు, షాపింగ్ మాల్స్, కోచింగ్ సెంటర్లు, క్లబ్బులు పబ్బులు లాంటి పబ్లిక్ ప్లేస్ లు  అన్నింటిని మూసేస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. 

 

 

 అయితే ఎన్ని ముందస్తు చర్యలు తీసుకున్నప్పటికీ కరోనా  పాజిటివ్ కేసులు సంఖ్య మాత్రం పెరిగిపోతోంది. తాజాగా తెలంగాణలో ఏకంగా కరోనా కేసుల సంఖ్య 18 పెరిగింది. దీంతో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. అయితే కరోనా  వైరస్ ను నియంత్రించేందుకు... ప్రజలు ఎవరు గుమికూడి ఉండవద్దని... అంతే కాకుండా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి అంటూ సూచిస్తుంది తెలంగాణ సర్కారు. కరోనా వైరస్ సోకిన పేషంట్స్ అందరికీ ఐసోలేషన్ వార్డులో ఉంచి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: