ప్రపంచవ్యాప్తంగా హడలెత్తిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తెలుగు రాష్ట్రాల లోని ప్రతి జిల్లా అధికారులు అనేకమైన చర్యలను చేపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లాలో పాఠశాలలు, థియేటర్లు క్రీడా మైదానాలు, పార్కులను కూడా మూసివేశారు. మరోవైపు కొంతమంది ఖమ్మం జిల్లా డాక్టర్లు స్వచ్ఛందంగా ముందుకు వస్తూ ప్రజలందరికీ కరోనా వైరస్ గురించి అవగాహన కల్పిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా తమ వంతు కరోనా గురించి ప్రచారం చేస్తున్నారు. అయితే కరోనా వైరస్ కారణంగా ఖమ్మంలో మొదటిసారిగా ఆలయాలు కూడా మూతపడుతున్నాయి. భక్తజన సంద్రం ఎక్కువగా ఆలయానికి తరలి వస్తే కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువయ్యే ప్రమాదం ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంటే ప్రతి జిల్లా నిర్ణయానికి కట్టుబడి ఉంది. ఆలయాలలో భక్తులకు అనుమతి లేదు కానీ పూజలు నిత్య నైవేద్యాలు జరుగుతున్నాయి.




ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలోని శ్రీ గుంటు మల్లేశ్వర స్వామి ఆలయంలో కరోనా వైరస్ లాంటి విష వైరస్ ఖమ్మం ప్రజలపై పడకుండా ఉండాలని మృత్యుంజయ హోమ కార్యక్రమాలను నిర్వహించారు అయ్యగారులు. ఖమ్మం ప్రజలకు ఎటువంటి అంటు వ్యాధులు ప్రబలకుండా ఉండేలా గుంటు మల్లేశ్వర స్వామి అనుగ్రహిస్తారు అని ఆలయ అధికారులు చెబుతున్నారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మృత్యుంజయ హోమ కార్యక్రమాన్ని చేపట్టినట్టు మీడియాకి తెలియపరిచారు ఆలయ అధికారులు.

 



ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూ పోతుంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో రెండు కొత్త కేసులు నమోదయ్యి మొత్తం కరోనా కేసుల సంఖ్య 18 చేరుకుంది. అయితే కరోనా బారినపడిన ఈ 18 మంది ఇతర దేశాల నుండి వచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. వీళ్లందరినీ ఐసోలేషన్ వార్డులో ఉంచగా... కొంతమంది వ్యాధి నయం అయ్యే స్థితిలో ఉన్నారని వైద్యాధికారులు చెబుతున్నారు. రేపు తెలంగాణ లో కరోనా పీడిత ప్రాంతమైన కరీంనగర్ లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: