కొరోనా ప్రభావం మనవాళిపై ఎంత ఉందో మాటల్లో చెపాల్సిన అవసరమే లేదు. ఈ వ్యాధి చైనాలో పుట్టి ప్రపంచ దేశాలకు దడ పుట్టిస్తుంది. అనేక వేల మంది ప్రాణాలను బలి తీసుకుంటుంది. ప్రపంచమంతటా కొన్ని లక్షల మంది బాధపడుతున్నారు. అటు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ ఎప్పటికి అప్పుడు వివరాలను సేకరిస్తుంది. అన్ని దేశాలతో ఈ వ్యాధి గురించి సంప్రదింపులు చేస్తున్నారు. దీని నివారణకు చర్యలు తీసుకునేలా చూస్తుంది.

 

అటు అగ్ర రాజ్యమైన అమెరికా సైతం వ్యాధి పేరు చెప్పితే గుబులు పడుతుంది. ఇప్పటికే చైనాలో కొన్ని వేల మంది చనిపోయారు. చైనా తర్వాత ఈ వ్యాధితో ఎక్కువ మంది ఇరాన్ లో చనిపోయారు. ఇటు భారత్ లోను ఇప్పటికే ఐదుగురు చనిపోయారు.

 

మిగతా దేశాల్లో కూడా చాల మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇరాన్ ప్రభుత్వం అక్కడి ప్రజలకు జాగ్రత్తలు పాటించాలని చెప్పిన ఎవరు పాటించక పోవడంతో వారు చాలా మంది ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని ఒక్క వ్యక్తి లేఖలో రాసి పంపారు.

 

మరో పక్క కంపెనీలో పని చేసే వారికీ ఇప్పటికే వర్క్ ఫ్రోమ్ హోమ్ ఇచ్చారు. వారి కంపెనీ యాజమాన్యం ఆరోగ్యం పట్ల ముందస్తు చర్యలు తీసుకున్నట్లు కంపెనీ అధికారులు తెలిపారు. ఐటీ కంపెనీలో ఎక్కువ మంది పని చేస్తూ ఉండటం వలన ఈ వ్యాధి తొందరగా వ్యాప్తి చెందుతుంది. ముందస్తు జాగ్రత్తతో చర్యలు తీసుకుంటున్నారు.

 

అమెరికాలో టెక్ కంపెనీలన్నీ తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సదుపాయాన్ని కల్పించాయి. సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఫేస్‌బుక్‌ తమ ఉద్యోగుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో, అందరికీ వర్క్ ఫ్రం హోం సదుపాయం కల్పిస్తూ సెలవలు ఇచ్చేసింది.

 

అంతేనా కరోనాతో ఆర్థిక ఇబ్బందులు కలగకుండా 6 నెలల వేతనాన్ని బోనస్‌గా ప్రకటించింది. సియాటిల్ లోని ఫేస్ బుక్ హెడ్ క్వార్టర్స్ లోని ఉద్యోగులతో పాటు సుమారు 45,000 మంది ఫుల్‌ టైమ్‌ ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జకర్‌బర్గ్‌ తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: