ప్రపంచవ్యాప్తంగా అందర్నీ గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కంటే అత్యంత ప్రమాదకరమైనది ఫేక్ న్యూస్ అని నిర్మొహమాటంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని వారాల క్రితం చికెన్ తినడం వలన కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని సోషల్ మీడియాలో యధేశ్చగా దుష్ప్రచారం జరిగింది. నిజమే అని నమ్మినా కోట్ల మంది ప్రజలు చికెన్ కొనడానికి ఆసక్తిని చూపలేదు. దాంతో చికెన్ ధరలు ఘోరంగా పడిపోగా... కోళ్ల వ్యాపారస్తులు కోట్లలో నష్టపోయారు. ప్రభుత్వ వైద్యాధికారులు, కలెక్టర్లు కూడా చికెన్ తినడం ద్వారా కరోనా వైరస్ సంక్రమించదని చెప్పినా ప్రజలు మాత్రం తప్పుడు వార్తలనే నమ్ముతున్నారు. దీని కారణంగా ఇప్పటివరకు వేల కోళ్లను సాదుతున్న వ్యాపారస్తులు వాటిని అమ్మోలేక, సాదలేక ఏమి చేయాలో తెలియక అర్ధం కానీ సందిగ్ధత లో పడిపోయారు. మరికొందరు బడా కోళ్ల వ్యాపారులు మాత్రం తన వద్ద బ్రతికున్న వేల కోళ్లను ప్రొక్లయిన్ సాయంతో పెద్ద గుంత తీసి అందులో వేసి వాటిని పూడ్చిపెడుతున్నారు. 

 

 


వివరాలు తెలుసుకుంటే... కర్ణాటక రాష్ట్రంలోని లోలాసూర గ్రామంలో ఒక కోళ్ల వ్యాపారి మాట్లడుతూ... 'రెండు కిలోలు తూగే ఒక కోడిని మేము 150 రూపాయలకి అమ్ముతాను. కానీ కోవిడ్ 19 వ్యాధి వలన చికెన్ ని కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దాంతో 2కిలోల కోడి కేవలం రూ.20 మంది మాత్రమే పలుకుతుంది. దాంతో నేను రూ. 10కోట్ల రూపాయలు నష్టపోయాను. ప్రభుత్వం కూడా కోళ్ల ఆహారమైన గింజల ధరను తగ్గించలేదు. ప్రస్తుతం నేను కోళ్ళని అలానే సాధుతే నాకు ఇంకా ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. అందుకే కోళ్ళని చంపక తప్పట్లేదు' అని ఆయన అన్నారు. 

 

 


మరొక ప్రాంతంలో ఏకంగా 25 వేల కోడి పిల్లలను ఒక వ్యాపారి సంచిలో వేసి వాటిని గుంత లో పడేసి పూడ్చేసాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇండియాలోనే ఏదో ఒక చోట వేల సంఖ్యలో కోళ్లుని బతికుండగానే పూడ్చి పెడుతున్నారు వ్యాపారులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: