ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ వైరస్ పాకిస్థాన్ లో మరెంతో దారుణంగా ఉంది . అక్కడ ఉన్న వారిని మరెంత గానో కలవరం చేస్తున్నాయి. అందులోనూ పక్కనే ఇరాన్ ఉండడం తో ఈ ప్రభావం మరెంతగానో పడింది పాకిస్థాన్ జనం మీద. పాక్ షియా ముస్లిం లో ఐరాన్ వెళ్లారు. ఒకరు, ఇద్దరు కాదు.  ఇరన్ కి భారీ సంఖ్యలో వెళ్లారు జనం . దీనితో వారిని లోపలకి అనుమతి ఇవ్వకుండా సరిహద్దుల్లో ఉన్న బలూచిస్తాన్ పట్టణం టాఫ్త్తాన్ లో పాకిస్థాన్ అక్కడ క్వారంటైన్ లోనే ఉంచింది.

 

 

అయితే ఈ ప్రదేశంలో వందలాది మందిని అక్కడ ఉంచిన దుస్థితి. అంతే కాకుండా కనీస వసతి సౌకర్యం కూడా లేకుండా వారిని అక్కడే ఉంచడం ఘోరాతి ఘోరం. కేవలం టెంట్లు వేసి వారిని ఉంచడం జరిగింది.  జైలు కంటే ఘోరంగా ఇది ఉండడం దారుణం. కప్పుకునే దుప్పటి లేదు. కనీసం ఒక తువ్వాలు కూడా లేదని అక్కడ ప్రజలు బాధ పడుతున్నారు.

 

కనీసం బాత్ రూమ్ కూడా లేదని వారు బాధని చెప్పుకున్నారు. మనుష్యుల్లా చూడకుండా జంతువులకి ఇస్తున్నట్టు వైద్యం ఇస్తున్నారని వారి ఆవేదనని తెలియ జేశాడు.ఈ దరిద్రం లో ఎన్నడూ జీవించలేడు అని మహ్మద్ బకీర్ చెప్పాడు. 

 

ఈ క్యాంపు లో  వేలాది మంది ఉన్నారు. అందులో పాజిటివ్ కేసులు కూడా ఉన్నాయి. కానీ కనీసం మంచి వైద్యం లభించలేదని విచారిస్తున్నారు. కనీసం ఐసోలేషన్ లో కూడా నిర్వహించలేదని వారు చెప్పారు. గత మూడు వారాలుగా కరోనా పరీక్షలు కూడా చెయ్యడానికి కుదరలేదుట. కనీసం పరీక్షలు చెయ్యడానికి ఎటువంటి సదుపాయాలు కూడా లేవు అని చింతిస్తున్నారు. టాఫ్త్తాన్ లో పాకిస్థాన్ అక్కడ క్వారంటైన్ లోనే ఉంచింది. ఈ హీన స్థితిలో బాధిస్తున్నారు అక్కడ ప్రజలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: