బంధాలు, అనుబంధాల‌కు విలువ లేకుండా పోతున్నాయి నేటి స‌మాజంలో. వ‌దిన అంటే త‌ల్లి త‌ర్వాత త‌ల్లి లాంటిది ఇక మ‌రిది అంటే బిడ్డలాంటి వాడు ఆ వ‌దిన‌కి కానీ అవేమీ లేకుండా కామ పిశాచుల్లా త‌యార‌వుతున్నారు కొంత మంది. ఇలాంటి బంధాల‌కు విలువ‌లేకుండా త‌ల్లి, చెల్లి, వ‌దిన లాంటివి ప‌ట్టించుకోకుండా ప్ర‌తి ఒక్క‌రిని కామ దృష్టితో చూసే కొంత మంది దుర్మార్గులు చాలా మంది ఉన్నార‌ని చెప్పాలి. మ‌రి ఇలాంటి సంఘ‌ట‌నే ఒక‌టి గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.

 

గుంటూరులోని తుఫాన్‌ నగర్ కి చెందిన పొట్ట కూటి కోసం ఆటో న‌డుపుకుంటున్న‌షేక్ నాగకుమార్ దారుణ హత్యకు గురయ్యాడు. త‌మ్ముడు పుల్లయ్య రోకలిబండతో దారుణంగా తలపై కొట్టి చంపేశారు. హతుడు నాగకుమార్, నిందితుల‌కి సమీప బంధువులే కావడం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అయితే వీరిద్ద‌రూ సొంత పెద్ద‌మ్మ‌, చిన్న‌మ్మ పిల్ల‌లు. 

 

​ఇటీవ‌లె వారం రోజుల కిందట నాగకుమార్ ఇంటికి వెళ్ళి అత‌ని భార్య రాణితో పుల్లయ్య అసభ్యంగా ప్రవర్తించాడు. తనముందే త‌న భార్య చేయి పట్టుకుని లాగడంతో నాగకుమార్ కి ప‌ట్ట‌లేనంత కోసం వ‌చ్చి ఆగ్ర‌హంతో పుల్లయ్య మీద చెయి చేసుకున్నాడు. త‌ర్వాత ఇంకోసారి ఇలాంటిది చూస్తే బావుండ‌ద‌ని తీవ్రంగా హెచ్చ‌రించాడు. అది మనసులో పెట్టుకున్న పుల్లయ్య.. ఎలాగైనా త‌న అన్న‌ను  హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో  తన తండ్రితో ఓ రౌడీ షీట‌ర్‌తో క‌లిసి చేతులు క‌లిపి అన్న‌ను చంప‌డానికి ప్లాన్ చేశాడు.  దీంతో అన్న‌య్య బ‌య‌ట‌కు వ‌చ్చే స‌మ‌యం గ‌మ‌నించాడు అత‌ని ప్ర‌తి క‌ద‌లిక‌ను గ‌మ‌నించి ఓ వీధిరౌడీతో క‌లిసి చేతులు క‌లిపి చంప‌డానిక ప్ర‌య‌త్నించాడు.  

 

రోజూలానే నాగ‌కుమ‌ర్ ఆటో వేసుకుని బ‌య‌ట‌కు వెళ్ళ‌గా ఎవ్వ‌రూ లేని స‌మ‌యం చూసి రోక‌లిబండ‌తో బ‌లంగా పుల్ల‌య్య అత‌ని అన్న‌య్య నాగ‌కుమార్‌ని కొట్టాడు. అక్క‌డిక‌క్క‌డే కుప్ప‌కూలిపోయాడు నాగ‌కుమార్ విష‌యం తెలుసుకున్న అత‌ని భార్య హుటాహుటిన ఘ‌ట‌నా స్థ‌లానికి వ‌చ్చి భ‌ర్త‌ను చూసి అత‌నిని తీసుకుని ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి వెళ్ళింది. కానీ అప్ప‌టికే ప్రాణం కోల్పోయిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో పోలీసుల‌కు చెప్పి కేసు పెట్టించింది. పోలీసులు రంగంలోకి దిగి కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

 

అయితే పుల్లయ్య, అతని తల్లి మరియమ్మ ఆ ప్రాంతంలో గ‌తంలో కూడా బెదిరింపుల‌కు పూనుకున్నార‌ని డ‌బ్బులు వసూళ్లకు పాల్పడేవారన్న ఆరోపణలున్నాయి. అంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోలేదని.  సంఘ విద్రోహక శక్తులుగా మారిన రౌడీషీటర్లను అదుపు చేయకపోవడం వల్లే ఈ రోజు ఇటువంటి దారుణానికి ఒడిగ‌ట్టారంటూ స్థానికులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: