వైసీపీ లీడర్స్ జంప్ అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే వారు ఇపుడు అధికారంలో  ఉన్నారు. వారికి ఏ కష్టం  వచ్చినా ప్రభుత్వం చేతిలోనే ఉంది. అధికారం చాలానే ఉంది. మరి దేనికీ లోటు లేని పవర్ ఫిల్  లీడర్లు ఒక్కసారిగా జంప్ అయిపోవడానికి కారణమేంటో..

 

అని ఆరా తీస్తే ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ కారణమని తేలింది. కరోనా వైరస్ కి భయపడని వారు ఈ భూగోళం మీద ఎవరూ  లేరంటే లేరు. ప్రపంచ పోలీస్, లోకానికే  పెద్దన్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంపే అబ్బా అంటున్నాడు. ఇక చైనాని గడగడలాడించి లోకం మీద పడిన కరోనా గురించి తెలిసిన వారు ఎవరైనా ఎదురొడ్డగలరా. ప్రగల్బాలు పలకగలరా

 

అందుకే వైసీపీ నేతలు సేఫ్ మోడ్ లోకి వెళ్ళిపోతున్నారు. బాహ్య ప్రపంచం నుంచి జంప్ అయిపోతున్నారు. మా దగ్గరకు రావద్దు బాబూ అంటూ క్యాడర్ కి శతకోటి నమస్కారాలు చేసేస్తున్నారు. మీరు వచ్చినా మేము అందుబాటులో  ఉండమని కూడా క్లారిటీగా  తేల్చిచెబుతున్నారు. మొత్తానికి కరోనా భయంలో తమను తామే నేతాశ్రీలు నిర్బందించుకుంటున్నారు.

 

విశాఖ దాకా వచ్చేసిన కరోనా ఎఫెక్ట్ కి బెంబేలెత్తిన శ్రీకాకుళం జిల్లా వైసీపీ పెద్దలు తాము జంప్ అంటున్నారు. ఈ నెల 31 వరకూ డోంట్ డిసర్బ్ మీ అంటున్నారు. మీరు కూడా మీ ఇళ్ళకు పరిమితమైపోండి. బయటకు రాకండి. వచ్చినా మా ఇళ్ళకు అసలు రాకండి అంటూ భారీ సందేశాలనే పంపిస్తున్నారు.

 

మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. మాజీ కేంద్ర మంత్రి కిల్లి క్రుపారాణి వంటివారు ఇలా పత్రికా ముఖంగా ప్రకటనలు ఇచ్చి మరీ టాటా చెప్పేస్తున్నారు. పైగా జనంలోకి రావద్దు, కరోనాపై యుద్ధం చేయాలంటే మనం కామ్  గా ఇంట్లో ఉంటేనే సాధ్యపడుతుందని హితవు చెబుతున్నారు. మొత్తానికి కరోనా భయం  అటు ప్రజలలోనే కాదు నేతల్లోనూ హై బీపీ పెంచేస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: