పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అదే అనిపిస్తోంది. ఏప్రిల్ మొదటి వారం తర్వాత అమరావతి నుండి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంకు వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. రాజధానిని అమరావతి నుండి విశాఖపట్నంకు వెళ్ళే విషయం గడచిన మూడు మాసాలుగా బాగా నలుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. జనవరి అసెంబ్లీ సమావేశాల్లో జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన చేసినప్పటి నుండి  రాష్ట్రంలో ఎంత రచ్చ అవుతున్నదో అందరూ చూస్తున్నదే.

 

చంద్రబాబునాయుడు హయాంలో రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల్లో కొందరు రాజధాని గ్రామాల్లో దాదాపు మూడు నెలలుగా ఆందోళనలు చేస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇదే విషయమై చంద్రబాబు రాష్ట్రంలోని జనాలను రెచ్చగొడుతు జోలె పట్టుకుని తిరిగిన విషయం గురించి ఎవరికీ చెప్పనక్కర్లేదు.  అదే సమయంలో రాజధాని మార్పుకు వ్యతిరేకంగా చాలామంది కోర్టుల్లో కేసులు కూడా వేశారు.

 

సరే ఇదే విషయమై కావాలనే ప్రతిపక్షాలు, రాజధాని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములు కొన్నవాళ్ళు ఇలా.. రకరకాల వాళ్ళు ఎలాగైనా జగన్ ప్రయత్నాలను అడ్డుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరి గోల ఎలాగున్నా జగన్ మాత్రం తొందరలోనే విశాఖపట్నంకు వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయినట్లే. స్ధానిక సంస్ధల ఎన్నికలు, బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలని అనుకున్నాడు. అయితే కరోనా వైరస్ ప్రభావం అంటూ ఎన్నికల కమీషనర్ స్ధానిక సంస్ధల ఎన్నికలను అర్ధాంతరంగా వాయిదా వేసిన విషయం అందరూ చూస్తున్నదే.

 

ఈ నేపధ్యంలోనే ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో ఎవరూ చెప్పలేకున్నారు. అదే సమయంలో పూర్తి బడ్జెట్ సమావేశాలు  స్ధానంలో  ఓట్ ఆన్ ఎకౌంట్  ప్రవేశపెట్టి ఓ ఐదు రోజుల్లో ముగించేయాలని జగన్ డిసైడ్ అయ్యాడు.  కాబట్టి ఓట్ ఆన్ ఎకౌంట్ సమావేశాలు కూడా అయిపోతే ఇక స్వేచ్చగా వెళ్ళిపోవచ్చు. అందుకనే ఏప్రిల్ మొదటి వారం తర్వాత ఎప్పుడైనా అమరావతి నుండి విశాఖపట్నంకు జగన్ వెళ్ళిపోయే అవకాశాలున్నాయి. మరి పర్టిక్యులర్ గా ఏరోజు అన్నది మాత్రం జగనే చెప్పాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: