తన పేరుతో కేంద్ర హోంశాఖ కార్యదర్శికి వెళ్ళిన లేఖ పై గడచిన మూడు రోజులుగా ఎంత రాద్దాంతం జరుగుతోందో ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు తెలియంది కాదు. మొన్నటి బుధవారం నాడు సుప్రింకోర్టు తీర్పు వచ్చిన కొద్ది సేపటికే నిమ్మగడ్డ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశారంటూ గోల మొదలైంది. ఆ లేఖను తాను రాయలేదని నిమ్మగడ్డ కూడా ఏఎస్ఐ వార్తా సంస్ధతో చెప్పాడు. మరి అదే విషయాన్ని మీడియా ముందుకొచ్చి ఎందుకు చెప్పటం లేదు ?

 

కేంద్రానికి పంపిన ఐదు పేజీల లేఖలో సంతకం కూడా నిమ్మగడ్డది కాదనే ఆరోపణలు వినబడుతున్నాయి. ఒకవేళ తాను లేఖ రాయలేదని స్వయంగా నిమ్మగడ్డే చెప్పిన తర్వాత కూడా లేదు లేదు ఆ లేఖను నిమ్మగడ్డే రాశాడంటూ చంద్రబాబునాయుడు, టిడిపి నేతలు బల్లగుద్ది చెప్పటంలో అర్ధమేంటి ? అంటే తాను రాయని లేఖ విషయంలో తానే రాసినట్లుగా నిమ్మగడ్డను చంద్రబాబు అండ్ కో కమిట్ చేయించేస్తున్నారా ?

 

సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే నిమ్మగడ్డే ప్రెస్ మీట్ పెట్టి  ఆ లేఖను తాను రాయలేదని గనుక చెబితే ఏమవుతుంది ? ఏమవుతుందంటే ముందుగా చంద్రబాబునాయుడు ఇరుక్కుంటాడు. ఎలాగంటే నిమ్మగడ్డ పేరుతో కేంద్ర హోంశాఖకు లేఖ రాయటమంటే మామూలు విషయం కాదు చాలా పెద్ద నేరం. అంతటి సాహసం ఎవరు చేస్తారు ? టిడిపి నేతల్లోనే ఎవరో ఒకరు ఆ లేఖను డ్రాఫ్ట్ చేసి హోంశాఖకు పంపుంటారు. ఎవరో లేఖ రాశారంటే రాయించిందెవరు ?

 

చంద్రబాబు అనుమతి లేకుండానే లేఖ రాయాల్సిన అవసరం ఎవరికుంది ? అంటే చంద్రబాబు ఆదేశాలతోనే ఎవరో లేఖ రాసుండాలి. పోలీసు దర్యాప్తులో లేఖ రాసిందెవరు ? రాయించిందెవరు ? అన్న విషయాలు బయటకువస్తాయి. నిమ్మగడ్డ గనుక ప్రెస్ మీట్ పెట్టి లేఖను తాను రాయలేదని చెబితే పోలీసులకు  ఫిర్యాదు ఎందుకు చేయలేదని అడుగుతారు. ఒకవేళ తనంతట తానుగానే పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇంకేమన్నా ఉందా ? అందుకనే నిమ్మగడ్డ నోరిప్పటం లేదంటున్నారు. ఎన్నాళ్ళు విజయవాడకు వెళ్ళకుండా మీడియా సమావేశం పెట్టకుండా హైదరాబాద్ లోనే కూర్చుంటాడు ?

మరింత సమాచారం తెలుసుకోండి: