ప్రపంచాన్ని వణికించేస్తున్న కరోనా వైరస్ కు పుట్టినిల్లు చైనానే అన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి చైనాలో మొన్నటి బుధవారం నాడు దేశం మొత్తం మీద ఎక్కడా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయమనే చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడైతే చైనాలో కరోనా వైరస్ భయటపడిందో రోజుల వ్యవధిలో  దేశమంతా పాకిపోయింది. కరోనా దెబ్బను ముందుగానే ఊహించిన ప్రభుత్వం పది రోజుల్లోనే  1500 పడకలు, 1000 పడకల సామర్ధ్యంతో రెండు ప్రత్యేక ఆసుపత్రులను నిర్మించేసింది.

 

పది రోజుల్లో 2500 పడకల సామర్ధ్యం గల రెండు ఆసుపత్రులను నిర్మించటం ప్రపంచంలో చరిత్రగానే చెప్పుకోవాలి. మొత్తం మీద దాదాపు రెండున్నర నెలల పాటు వైరస్ దెబ్బకు చైనా అల్లకల్లోలమైపోయింది. ఒక్కసారిగా చైనాను వణికించేసిన ఈ వైరస్ ను నియంత్రించేందుకు అక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటని యావత్ ప్రపంచం అధ్యయనం చేసింది.

 

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం వైరస్ ఉధృతిని అరికట్టటానికి అక్కడి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంది. ప్రత్యేక ఆసుపత్రులను నిర్మించటమే కాకుండా దేశం మొత్తం మీద మెడికల్ ఎమర్జెన్సీని విధించేసింది. అదే సమయంలో దేశంలోని చాలా ప్రాంతాలను షట్ డౌన్ చేసేసింది. అంటే గ్రామాల నుండి పట్టణాలు, నగరాలనే తేడా లేకుండా మొత్తం కార్యకలాపాలన్నింటినీ మూసేసింది. వైరస్ పుట్టిన వూహాన్ ప్రావిన్స్ కు ఇతర ప్రావిన్సులతో సంబంధాలను తెంచేసింది.

 

ఏ గ్రామం వాళ్ళని ఆ గ్రామంలోనే ఏ పట్టణం, ఏ నగరంలో జనాలను ఉన్నచోటు ఉన్నట్లే కట్టడిచేసింది. ఇంటింటికి తిరిగి వైద్య సిబ్బందితో జనాలకు పరీక్షలు చేయించింది.  ఎవరిని రోడ్లమీదకు రానీకుండా ఆంక్షలు విధించింది. అంటే దాదాపు కనిపిస్తే కాల్చివేత లాంటి నిషేధాన్ని విధించిందన్నమాట. ప్రపంచదేశాలతో సంబంధాలను కట్ చేసేసింది.  ఇన్ని చర్యలను ఒకేసారి తీసుకోవటం వల్ల వైరస్ ప్రబలిన మూడు నెలల్లోనే అదుపులోకి వచ్చిందని చైనా ప్రభుత్వం అనుకుంటోంది. ఇందులో భాగమే బుధవారం ఒక్క కేసు కూడా నమోదు కాకపోవటం.

మరింత సమాచారం తెలుసుకోండి: