పేరుకే మాత్రమే  బిజెపి, జనసేన పార్టీల  మధ్య పొత్తు. క్షేత్రస్ధాయిలో గమనిస్తే కనీసం నాలుగు జిల్లాల్లో తెలుగుదేశంపార్టీతోనే జనసేన నేతలు పొత్తులు పెట్టుకున్నారు. రెండు పార్టీల నేతలు బహిరంగంగానే పొత్తులు పెట్టుకుని నామినేషన్లు వేసిన విషయం ఇటు చంద్రబాబునాయుడుకు అటు పవన్ కల్యాణ్ కు కూడా స్పష్టంగా తెలుసు. కానీ ఇద్దరు అధినేతలు పై  జిల్లాల్లోని రెండు వైపుల నేతల్లో ఎవరినీ ప్రశ్నించలేదు. దీన్ని బట్టి అనధికారికంగా రెండు పార్టీల మధ్య పొత్తులున్నట్లే అర్ధమైపోతోంది.

 

కొద్ది కాలంగా బిజెపి, జనసేన పార్టీలకు చెందిన ముఖ్యనేతలు నాదెండ్ల మనోహర్, జీవిఎల్ నరసింహారావు, సోము వీర్రాజు, దగ్గుబాటి పురంధేశ్వరి లాంటి వాళ్ళ మధ్య సమావేశాలు జరిగిన విషయం అందరూ చూసిందే. ఒకటికి రెండుసార్లు సమావేశమైన ఈ నేతలు ఏమి చర్చించుకున్నారో ఎవరికీ అర్ధంకాలేదు.  స్ధానిక సంస్ధల ఎన్నికల్లో వైసిపికి తమ సత్తా ఏమిటో చూపిస్తామంటూ చాలా మాటలే మాట్లాడారు. కానీ చివరకు ఏమైంది ? రెండు పార్టీలు కలిపి కూడా పూర్తిస్ధాయిలో నామినేషన్లను వేయలేకపోయింది.

 

విచిత్రమేమిటంటే కృష్ణా జిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో రెండు పార్టీల నేతలు ఎవరికి వారుగానే నామినేషన్లు వేసుకున్నారు. పైగా టిడిపి, జనసేన పార్టీల నేతలు కలిసి  అవగాహనతో నామినేషన్లు వేశారు.  ఎంపిటిసిల నామినేషన్లు ఒకిరికి, జడ్పిటిసిలు మరొకరికి అన్నట్లుగా అవగాహన కుదుర్చుకుని నామినేషన్లు వేశారు. అలాగే సర్పంచి పదవులకు కూడా ఎవరెవరు ఎక్కడెక్కడ నామినేషన్లు వేయాలనే విషయంలో ఇప్పటికే చర్చలు పూర్తయినట్లు సమాచారం.

 

ఇక్కడ విచిత్రమేమిటంటే టిడిపి+సిపిఐలు కలిసినా ఎక్కడా సఖ్యత కనబడలేదు. వీళ్ళు కూడా ఎవరికి వారుగానే నామినేషన్లు వేశారు. అంటే సిపిఐతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు బకరాను చేసిన విషయం అర్ధమైపోతోంది. అదే సమయంలో బిజెపితో పొత్తు పెట్టుకుని కూడా పవన్ టిడిపితో కలవటంతో కమలం పార్టీ నేతలు పిచ్చోళ్ళయిపోయారు. మొత్తానికి స్ధానిక సంస్ధల ఎన్నికలతో మరోసారి తేలిందేమిటయ్యా అంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ను నమ్మేందుకే లేదని. మరిప్పటికైనా మిత్రులకు బుద్ధి వస్తుందా ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: