ఈరోజు యావత్ భారత దేశం తల ఎత్తుకునే సంఘటన జరిగింది. 2012 నాటి నిర్భయ హత్యాచార ఘటన కేసులో నలుగురు దోషులకు ఈరోజు  మరణ శిక్ష పడింది. అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. .అయితే కాంగ్రెస్ నాయకురాలు, నటి విజయశాంతి  నిర్భయ దోషులను ఉరితీయడం పట్ల  స్పందించారు.ఈ నేరానికి పాల్పడిన ఏడేళ్ల తర్వాత వారికి శిక్ష పడింది ఇది గర్వించదగ్గ విషయం అని.  ఈ నిర్ణయం కేవలం నిర్భయ కే కాదు,  ఆడపిల్లలున్న ప్రతి కుటుంబానికి హర్షణీయం అని  ఆమె అభిప్రాయపడ్డారు.

 

అయితే అ దోషుల్లో ఒకరు మైనర్. అందువల్ల  ఇంతటి దారుణమయిన  క్రూరత్వానికి పాల్పడిన అసలు నేరస్తుడు మరొకడు మైనర్ పేరుతో విడుదల కావడం బాధాకరం అని భావించారు. కానీ ఏదో ఒక రూపంలో తగిన శిక్ష పడుతుందని విశ్వసిస్తున్నాను’ అని ఆమె వ్యాఖ్యానించారు. నిజానికి ఈ శిక్ష సరిపోదు, అని ఆమె అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో కలకలం రేపిన దిశ కేసు పరిణామాలను విజయశాంతి ప్రస్తావించారు.

 

‘‘నిర్భయ విషయంలో గానీ, దిశ ఘటనలో గానీ ఆ దారుణాలు జరిగినప్పుడు యావత్ సమాజం ఆందోళనలకు దిగి దోషులకు వెంటనే శిక్ష పడాలని, ఎన్‌కౌంటర్ చెయ్యాలని భారీ ఎత్తున నిరసనలకు దిగింది.  దోషులకు శిక్ష పడినంత మాత్రాన అత్యాచారాలు ఆగిపోతాయా? వాళ్ళను క్షమించి వదిలేయాలి... అనే వాదనలు లేవదీస్తున్నారు.శిక్ష పడకుండా వదిలేస్తే శిక్షేగా అని తప్పు చేస్తారు. అప్పుడు  ఆడపిల్లను మ్యూజియంలో చూడాల్సిందే’’ అని ఆమె అభిప్రాయపడ్డారు.

 

 

ఈ  రోజున కరోనా వ్యాధి విజృంభించడంతో అందరికీ ప్రాణభయం పట్టుకుని ఎవరికివారు మాస్కులు వేసుకుంటూ, సానిటైజర్లు వాడుతూ ఇంటికి పరిమితమై ఇల్లు చక్కదిద్దుకుంటున్నారు.ప్రాణభయంతో అల్లాడుతున్నారు. అదే జాగ్రత్త   ఆడపిల్ల విషయంలోనూ జరిగితే మన సమాజం ఇలా ఉండదు .సంస్కారం  అనేది మన ఇంటి నుంచి మొదలైతే ఆడపిల్లను కాపాడుకోగలుగుతాం.ఎవరి ఆడపిల్ల అయిన ఒకటే.  కన్నతండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులే ఆడపిల్లల పాలిట యమదూతలుగా మారి వారి జీవితాల్ని పాడుచేస్తున్న వార్తల్ని చదువుతుంటే ఎంతో బాధగా ఉంది అని తెలిపారు.

 

  స్త్రీమూర్తి ప్రాధాన్యత గురించి ఇంట్లో, పాఠశాలల్లో... యావత్ సమాజంలోని మగపిల్లలకు తెలియజేసి వాళ్ళను సరయిన పద్దతిలో పెంచితే  అత్యాచారాలపై ఇంతగా అందోళన చెందాల్సిన పరిస్థితి రానే రాదు. మృగాళ్ళకు శిక్షలు పడాలా.. వద్దా.. అనే దురదృష్టకరమైన చర్చ చేయాల్సిన దుస్థితి ఉండదు’’ అని విజయశాంతి అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: