ప్రస్తుతం ఈ విశ్వంలో ఉన్న అన్ని గ్రహలలో భూ గ్రహం ఒక ప్రత్యేకమైనది.. ఎందుకంటే సమస్త ప్రాణులు ఇక్కడ జీవించే అవకాశం ఉంది.. జీవిసున్నాయి కూడా.. ఇక అన్ని వనరులు ఉండటం ఈ భూ గ్రహం ప్రత్యేకత.. అందుకే ఇప్పటి వరకు మనుషులకు ఎలాంటి హని లేకుండా జీవించ గలుగారు.. ఎన్నో అద్భుతాలను సృష్టించారు.. అయితే మనుషులు జీవించడానికి అనువైన గ్రహాన్ని ఇప్పటి వరకు కనుగొనలేదు కాని ఆ ప్రయోగం పరిశోధనలో ఉంది..

 

 

ఇకపోతే మనలాగే మరో గ్రహం పైన ఏదో ప్రాణి జీవిస్తుందనే అనుమానాలు అప్పుడప్పుడు శాస్త్రవేత్తలు చెప్పడం మనం వింటూనే ఉన్నాం.. దాని పేరు ఏలియన్స్ అని కూడా అన్నారు.. ఇదిలా ఉండగా ఒకవేళ ఏలియన్స్ కనుక భూమి మీదికి వస్తే మానవాళికి ప్రమాదం అనే హెచ్చరికలు కూడా చేసారు.. అయితే ఇవేవి జరగకుండానే ప్రజలను భయపెట్టే విధంగా కొన్ని కొన్ని అవాస్తవ ప్రచారాలు తరచుగా జరుగుతున్నాయి.. కాగా మనం ఉన్న ఈ విశ్వం ఎంత విశాలమైనతో అంత ప్రమాదకరమైనది కూడా... ముఖ్యంగా గ్రహశకలాలు, ఉల్కలు, తోకచుక్కల వంటివి భూమికి శాపాలుగా ఉన్నాయి. అవి ఎప్పుడు భూమివైపు దూసుకొస్తాయో, ఎప్పుడు భూమిని ఢీకొంటాయో చెప్పలేం. ఇప్పటికే చాలా గ్రహశకలాలు భూమివైపు వచ్చి వెళ్లాయి.

 

 

ఇలాంటి విషయాలు శాస్త్రవేత్తలు చెప్పినప్పుడు కాస్త భయంగా అనిపిస్తుంది.. అయితే ఇప్పటికి చాలా సార్లుగా ఈ భూమి అంతమవుతుందనే పుకార్లు ఎన్నో సార్లు వచ్చాయి.. తాజాగా మరో సారి ఇలాంటి వార్త తెరపైకి వస్తుంది.. అదేమంటే 2020 సంవత్సరం ఏప్రిల్‌ 19న ప్రపంచం కనుమరుగవుతోందని పిడుగు లాంటి వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.. అసలే ప్రజలంతా కరోనాతో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బ్రతుకుతుంటే. ఇప్పుడు ఈ వార్త సంచలనంగా మారింది. ఇక ఓ భారీ గ్రహ శకలం భూమికి సమీపంగా వెళ్తుందని మూడేళ్ల క్రితం నాసా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఎలా స్వీకరించారో కానీ అంతరిక్షం నుంచి వస్తున్న ఓ పెద్ద గ్రహశకలం భూమి నుంచి దూసుకెళ్తుందని, అప్పుడు యుగాంతం తప్పదని ప్రచారం చేస్తున్నారు..

 

 

అయినా దీంట్లో ఉన్న వాస్తవమెంత అనేది ఎవరికి అర్ధం కావడం లేదు.. ఇదిలా ఉండగా  వాస్తవాన్ని గమనిస్తే 2వేల అడుగుల పరిమాణం ఉన్న జేఓ25 అనే గ్రహశకలం భూమి నుంచి 1.8 మిలియన్‌ కిలోమీటర్ల దూరంలో దూసుకెళ్లనుందని నాసా పేర్కొంది. ఇది చంద్రుడి నుంచి భూమికి గల మధ్య దూరానికి 4.6 రెట్లు దూరంలో పయనించనుంది. కనుక భూమిని తాకే అవకాశమే లేని కారణంగా ఎటువంటి ప్రమాదం సంభవించదని, కొందరు పనిగట్టుకుని చేస్తున్న పుకార్లు నమ్మవద్దని సూచిస్తుంది.. అంతే కాకుండా గడిచిన 400ఏళ్లలో కానీ.. రాబోయే మరో 500 ఏళ్లలో కానీ భూమికి ఇంత సమీపంలోకి రానున్న గ్రహశకలం మరేది ఉండబోదని నాసా స్పష్టం చేసింది.. అందుకే ఎవరు ఎన్ని చెప్పినా గాలి మాటలను గాల్లోనే వదిలేయాలి కాని ఆలోచించి బుర్రపాడు చేసుకోకండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: