భారత దేశంలో ప్రతి సంబరాలకు ఆనందంతో బానా సంచాలు పేలుస్తుంటారు.  ఈ బాణా సంచా కోసం రక రకాల వెరైటీలు వాడుతుంటారు.  ఇక దీపావళి వచ్చిందంటే.. దేశం మొత్తం పటాకుల మోత మోగాల్సిందే.  అయితే ఈ బాణాసంచాకు ఉపయోగించే పటాకులు తమిళ నాట ఎక్కువగా తయారు అవుతుంటాయి.  ఈ కర్మాగారాలు ఎక్కువగా అక్కడే ఉంటాయి.  తమిళ నాట శివకాశీ కి పెట్టింది పేరు అంటారు.  అయితే ఈ బానా సంచాల కర్మాగారాల్లో ఎప్పుడు ఎక్కడో అక్కడ ప్రమాదాలు జరుగుతుంటాయి.  ఈ విషయంలో ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా కొంత మంది నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదాలుజరుగుతూనే ఉన్నాయి.

 

తాజాగా  విరుదునగర్ జిల్లాలోని సత్తూరు సమీపంలోని సిప్పిప్పారై వద్ద ఓ బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించగా, మరో ఏడుగురు తీవ్రగాయాలతో ఆసుపత్రిపాలయ్యారు.  మరణించిన వారిలో ఆరుగురు మహిళలున్నారు.  అయితే ఈ పేలుడు ధాటికి అక్కడే కాదు చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా విధ్వంసం ఏర్పడింది. పేలుడు తీవ్రతకు కర్మాగారం పూర్తిగా ధ్వంసమైనట్టు తెలుస్తోంది. శిథిలాల కింద చిక్కుకున్న క్షతగాత్రులను సహాయ సిబ్బంది బయటకు తీసుకువచ్చి ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ బాణా సంచాల వల్ల తీవ్రంగానే నష్టం మిగిల్చిందని అంటున్నారు. 

 

తాజాగా ఈ విషయంపై ప్రభుత్వం ఆంక్షలను,  సూచనలు ఏ మాత్రం పాటించకుండా బాణా సంచా ఫ్యాక్టీ నడుపుతున్న యజమానులపై చర్యలు తీసుకుంటామని అంటున్నారు.  బాధితులకు నష్టపరిహారం ఇవ్వాల్సి బాధిత కుంటుంబాలు అడుగుతున్నారు.  అయితే ఈ ప్రమాదానికి గల కారంణ ఏంటా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.  ఏది ఏమైనా ఇలాంటి కార్మగారాల్లో సేఫ్టీ మార్గాలు ఎందుకు పాటించని ప్రశ్నిస్తున్నారు.   గత కొంత కాలంగా  తమిళనాడులో అనేక ప్రమాదాలు జరిగినా జాగ్రత్త చర్యలు శూన్యం అని చాటుతూ మరో దుర్ఘటనే సాక్ష్యం అని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: