దాదాపు ఏడేళ్ల పాటు వాయిదా పడుతూ వస్తున్న నిర్భయ కేసులో నిందితుల కేసు  ఎట్టకేలకు పరిష్కారమైన విషయం తెలిసిందే. నిర్భయ కేసులో నలుగురు నిందితులకు ఉరిశిక్ష అమలు చేస్తూ పటియాల కోర్టు తీర్పు ఇవ్వగా ఈరోజు ఉదయం ఐదున్నర గంటలకు నలుగురు నిందితులకు ఉరిశిక్ష అమలైంది . అయితే ఎన్నో ఏళ్ల నుంచి దేశం మొత్తం ఎదురు చూస్తున్న నిర్భయ నిందితులకు ఉరి అమలు కావడంతో... ఈ ఘటనపై హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అయితే నిర్భయ నిందితులకు ఎప్పుడూ ఉరి పడాల్సి ఉండగా ... చట్టంలో  ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ రావడంతో ఉరి ఎన్నో  సార్లు కోర్టులు  విధించినప్పటికీ వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు నిందితులకు చట్టపరంగా ఉన్న అన్ని అవకాశాలు పూర్తవడంతో ఉరికంబం ఎక్కల్సిన సమయం ఆసన్నమైంది. 

 


 అయితే నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేసేందుకు నిర్భయ తల్లిదండ్రులు 7 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేశారు. సుదీర్ఘ పోరాటానికి ఎట్టకేలకు ఫలితం లభించింది. నిర్భయ తల్లిదండ్రులే  కాదు నిర్భయ తల్లి ఆశ దేవి తరఫున న్యాయస్థానాల్లో పోరాడిన మహిళా న్యాయవాది సైతం అలుపెరుగని పోరాటం చేశారు. దేశ చట్టాలలోని లొసుగులను  అడ్డం పెట్టుకొంటూ ఉరిశిక్షను వాయిదా పడేలా చేస్తూ కాలయాపన చేస్తున్న నిర్భయ నిందితులకు ఎట్టి పరిస్థితుల్లో శిక్షపడేలా చేయాలని దృడ సంకల్పంతో నిర్భయ తల్లి ఆశ దేవి తరపు న్యాయవాది ఎంతో  సమర్థవంతంగా కోర్టులో వాదనలు వినిపించారు. 

 


 నిర్భయ కేసులోని నిందితులు  ఎన్ని ఎత్తులు వేసినా వాటికి  పై ఎత్తులు వేస్తూ నిర్భయ తల్లికి దైర్యం నింపుతూ  వచ్చారు. ఆ న్యాయవాది పేరే సీమ కుష్వాహా . 2012 సంవత్సరంలో నిర్భయపై అతి దారుణంగా అత్యాచారం జరిగిన నాటి నుంచి... నిన్న నలుగురు నిందితులకు ఉరిశిక్ష అమలు అయ్యే వరకు.. నిర్భయ  తల్లి ఆశాదేవి  తరఫున న్యాయపోరాటం చేశారు న్యాయవాది సీమ. నిర్భయ దోషులకు పై ఎఫ్ఐఆర్ నమోదు కావడం చార్జిషీట్ నమోదు లాంటి  తదితర విషయాలు అన్నింటిలో  న్యాయవాది సీమ  తమ ముద్ర కనిపించేలా చేశారు. ఇక బాధితురాలి పక్షాన సమర్థవంతంగా వాదించిన న్యాయవాది సీమ కుష్వాహా ... ఇప్పుడు వరకు ఎంత ఫీజు  తీసుకున్నారో  తెలుసా. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. కనీసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే ఎన్నో ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేశారు. కేవలం తన స్నేహితురాలికి  సాయం చేస్తున్నాను అని మాత్రమే న్యాయవాది భావించి కేసులు వాదించారు. ఎన్నో ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేసి ఎట్టకేలకు నిందితులకు ఉరిశిక్ష పడేలా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: