చైనా లో పుట్టి ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా వైరస్.. దీని దెబ్బకు చైనా ,ఇటలీ లు అతలాకుతలం అవుతుండగా తాజాగా స్పెయిన్ ,అర్జెంటీనా ,ఇరాన్ లు కూడా బాగా ప్రభావితం అవుతున్నాయి దాంతో స్పెయిన్, అర్జెంటీనా, ఇటలీ ఈనెల 31 వరకు  లాక్ డౌన్ విధించాయి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇళ్ల  నుండి ఎవరు బయటికి రావొద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక భారత్ లో కరోనా మరి అంత తీవ్ర  రూపం దాల్చలేదు కాని పరిస్థితి మాత్రం సీరియస్ గానే వుంది బయటి దేశాల నుండి వస్తున్న వారివల్ల మన దేశం లో ఇబ్బందులు తప్పడం లేదు దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి.
 
అయితే  మిగితా రాష్ట్రాలతో పోలిస్తే కేరళ లో కరోనా  విజృంభిస్తుంది. ఈ ఒక్క రోజే 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దాంతో ఇప్పటివరకు  అక్కడ కరోనా బాధితుల సంఖ్య 40కి చేరింది. తాజాగా నమోదైన 12 కేసుల్లో ఎర్నాకులం లో 5, కసరగోడలో 6, ఒకటి పాలక్కాడ్ లో నమోదైంది. కాగా ఎప్పటికప్పుడు కరోనా పై  సమీక్షలు జరుపుతున్న కేరళ ముఖ్యమంత్రి  పినరయ్ విజయన్ పరిస్థితి దారుణంగా ఉందని పేర్కొన్నాడు.
 
ఇక తెలంగాణ విషయానికి వస్తే  నిన్నటి దాక కరోనా బాధితుల సంఖ్య 16 గా ఉండగా ఈరోజు మరో మూడు కేసులు తేలాయి. దాంతో ప్రస్తుతం కరోనా బాధితుల సంఖ్య 19 కు చేరుకుంది. కరోనా వ్యాప్తి ని అరికట్టేందుకు రాష్ట్ర సర్కార్ అన్నిరకాల చర్యలను తీసుకుంటుంది. అయినా కూడా రోజు రోజుకి కరోనా చాప కింద నీరులా పాకుతుండడం తో ప్రస్తుతం జరుగుతున్న 10వతరగతి పరీక్షలను కూడా వాయిదావేయాలని ప్రభుత్వాన్ని ,హై కోర్టు ఆదేశించింది. దాంతో ఆ పరీక్షలు  కూడా వాయిదాపడనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: