ప్రపంచాన్ని ఒక వైపు వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది.. ఈ నేపథ్యంలో జనాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నారు.. ఈ మేరకు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు కరోనా కేసులు నమోదు అయ్యాయి.. ఈ వైరస్ వ్యాప్తి ప్రబలకుండా అనేక చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తుంది.. ఈ క్రమంలో దేవుళ్ళను పూజిస్తూ మరి కొందరు ఉన్నారు.

 

 

 

ఇది ఇలా ఉండగా భద్రాచలం లో క్షుద్ర పూజలతో ప్రజలు బెంబేలు ఎత్తుకున్నారు.. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని క్షుద్రపూజలు కలకలం రేపాయి. మానసిక బాధలను క్షుద్రపూజలు ద్వారా తొలగింపజేస్తామని నమ్మబలికిన ఓ ముఠా వలలో పడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు వ్యక్తులు మోసపోయిన టేకులపల్లి మండల పరిధిలో గురువారం వెలుగుచూసింది. నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన షేక్‌ బకర్‌సిద్ధిక్‌ కొంతకాలంగా మానసిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. ఇతనికి టేకులపల్లి మండలానికి చెందిన కోరం రవీందర్‌ అలియాస్‌ సురేశ్‌తో పరిచయముంది.

 

 

షేక్‌ బకర్‌సిద్ధిక్‌ మానసిక ఇబ్బందులను ఆర్థికంగా మలుచుకోవాలని భావించిన రవీందర్‌ కన్నింగ్ ప్లాన్ వేశాడు. క్షుద్రపూజలు చేసి ఇబ్బందులు తొలగిస్తాననీ, ఇందుకుగానూ ఖర్చు అవుతుందని తెలపడంతో బకర్‌సిద్ధిక్‌ కూడా ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. మొత్తం రూ.1.75లక్షలకు ఒప్పందం చేసుకుని అడ్వాన్స్‌గా రూ.49,999 ఫోన్‌పే ద్వారా పంపించాడు.ఈ మేరకు పోలీసులు అతన్ని ఒక నిర్మానుష్య ప్రాంతానికి రమ్మని పిలిచాడుట.. 

 

 

వివరాల్లోకి వెళితే.. అతను చెప్పిన ప్రకారం అతను సమాదుల దగ్గరకు వెళ్ళాడు... తీరా పూజను ప్రారంభించాలి అంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పొదల్లోంచి వచ్చి దాడి చేస్తారు దానితో వారు అక్కడ నుంచి పారిపోయారు.. దీంతో భాదితుడు పోలీసులకు పిర్యాదు చేశారు.. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగాడు...పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు...

.

మరింత సమాచారం తెలుసుకోండి: