దేశ వ్యాప్తంగా ఎంతోమంది కరోనా వైరస్ బారినపడి మృత్యువాత పడుతున్న విషయం తెలిసిందే. రోజురోజుకు దేశంలో విలయ తాండవం చేస్తూ ఎంతో మందిని మృత్యువుతో పోరాడేలా చేస్తుంది మహమ్మారి వైరస్. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అప్రమత్తమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు... ఎన్నో కఠిన నిబంధనలను  అమల్లోకి తెస్తున్నాయి . అయినప్పటికీ కొంతమంది తప్పిదాల కారణంగా కరోనా  వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది. అయితే తాజాగా నాని అనే వ్యక్తీకి కరోనా  వైరస్ లక్షణాలు ఉండడంతో మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఐసోలేషన్ వార్డులో  చికిత్స పొందుతుండగా అక్కడినుంచి తప్పించుకుని హైదరాబాద్ వచ్చాడు. ఈ క్రమంలోనే భీమవరం వెళ్లడానికి అతను బస్సు ఎక్కాడు. అయితే మహారాష్ట్రలో కరోనా వైరస్ ను నియంత్రించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కరోనా  వైరస్ సోకిన వారికి చేతికి స్టాంప్ వేస్తున్న తరుణంలో ఆ వ్యక్తిని  బస్సులో కండక్టర్ వెంటనే ఆ వ్యక్తిని గుర్తుపట్టాడు. అతన్ని  ఆర్టీసీ అధికారులను నిలదీయడంతో అతను అసలు విషయం ఒప్పుకున్నాడు. 

 

 

 వెంటనే అతన్ని హైదరాబాద్లోని ఐసోలేషన్  వార్డుకు తరలించారు.ఇదిలా ఉంటే  కరోనా  వైరస్ కు ఎలాంటి మందులు లేవని..  కేవలం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే ముఖ్యం అంటూ ఈటల రాజేందర్ సూచించారు. ప్రతి ఒక్కరూ కరోనా వైరస్  నియంత్రణకు సహకరించాలంటూ  ఈటెల రాజేందర్ కోరారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 18 మందికి కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా వైరస్ సోకిన వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదు అంటూ ఈటెల రాజేందర్ తెలిపారు. కేవలం విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే ఈ కరోనా  వైరస్ లక్షణాలు ఉన్నాయి అంటూ తెలిపారు. 

 

 

 తెలంగాణలో కరోనా వైరస్ ను నియంత్రించేందుకు కేసిఆర్ కఠిన నిబంధనలు అమల్లోకి తెస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విద్యా సంస్థలతోపాటు జన సంచారం ఉన్న  అన్ని  ప్రాంతాలను మూసివేస్తు  సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే విదేశాల నుంచి వచ్చి సెల్ఫ్ డెక్లరేషన్ ఇవ్వకుండా తిరుగుతున్న వారికోసం తెలంగాణలో ప్రత్యేక బృందాలు సెర్చ్ ఆపరేషన్ కూడా ప్రారంభించారు. ముఖ్యంగా కజకిస్తాన్, దుబాయ్,ఇండోనేషియా నుంచి వచ్చిన వారిపై ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెడుతోంది. మరోవైపు రోజురోజుకు రాష్ట్రంలో కరోనా వైరస్ అనుమానితులు కూడా పెరిగిపోతున్నారూ.

మరింత సమాచారం తెలుసుకోండి: