కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రజలు ఏ విషయానికి అయినా వణుకుతున్నారు అంటే అది ఈ విషయానికే అని కళ్ళు మూసుకొని చెప్పచ్చు. ఈ కరోనా వైరస్ కారణంగా ఎందరో మరణించారు. చైనాలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచమంతా వ్యాపించి ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ సోకి ఎవరైనా చనిపోతే ఎం అవుతుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. 

 

ఒక వ్యక్తి ఈ కరోనా వైరస్ కారణంగా మరణిస్తే.. అతని మృతుదేహం నుండి కరోనా వైరస్ వ్యాపిస్తుందా ? లేదా అనే ప్రశ్న అందరి మదిలో ఉంది. ఇకపోతే ఈ నేపథ్యంలోనే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రశ్న నేపథ్యంలో ఓ ఫోరెన్సిక్ నిపుణుడు సమాధానం ఇస్తు అవునని అంటున్నారు. 

 

ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దుబాయిలోని ప్రముఖ యూనివర్సిటీలో ఫొరెన్సిక్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ న్రశాంత్ సింగ్‌ను ఓ ప్రముఖ మీడియా సంస్ద ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. న్రశాంత్ సింగ్‌ కరోనా వైరస్ గురించి చెప్తూ.. కరోనా వైరస్ కారణంగా ఎవరైనా మరణించినప్పటికీ వారి మృతుదేహంపై కరోనా జీవించే ఉంటుంది.. నిర్జీవ వస్తువులపై వైరస్ కొన్ని గంటలు మాత్రమే జీవించి ఉంటుంది. 

 

అందువల్ల కరోనా వైరస్ బారిన పది ఎవరైనా చనిపోయినప్పుడు జాగ్రత్తలు పాటించకుండా ఆ వ్యక్తి బట్టలు, వస్తువులు గని లేదా మృతుదేహాన్ని తాకడం వల్ల వారికీ కరోనా సోకె అవకాశం ఉంది అని.. అందుకే మృతదేహాన్ని అత్యధిక ఉష్ణోగ్రత వద్ద దహనం చేయాలి అని.. లెట్ అవుతుంది అంటే ఆ మృతదేహాన్ని 10 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద భద్రపర్చాలి అని అతను చెప్పారు. కాగా మృతుదేహం కుళ్ళిపోతే వైరస్ మరింతగా వ్యాపించే అవకాశం ఉంది'' అని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: