ప్రపంచంలో కరోనా చేస్తున్న కరకాలం అంతా ఇంతా కాదు.. మనుషులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఎక్కడ చూసినా ఈ కరోనా వైర్ గురించే మాట్లాడుతున్నారు.  ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరూ కరోనా అన్న పదం పలుకుతూనే ఉన్నారు.  ప్రపంచం మొత్తం ఇప్పటికే పదివేల మంది మృత్యు వాత పడ్డారు.  లక్షకు పైగా కేసులు నమోదు అయ్యాయి.  ఈ కరోనా వల్ల ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక కేంద్రాలు, మాల్స్, థియేటర్లు, ఫంక్షన్ హాళ్లు ఒక్కటేమిటి అన్నీ మూసి వేసి ఇంట్లో కూర్చోమంటున్నారు. 

 

విమానాలు రద్దవడంతో వరుడు మారిషస్ లో నిలిచిపోగా, ముహూర్తం మించిపోతుండడంతో కుటుంబసభ్యులు వీడియో కాల్ సాయంతో పెళ్లి చేశారు.  ఉత్తరప్రదేశ్ లోని అంటాచౌరాహే ప్రాంతానికి చెందిన తౌసిఫ్ మారిషస్ లో ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. అతనికి షాజహాన్ పూర్ కు చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 19న వివాహ ముహూర్తం నిర్ణయించారు.  ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ వల్ల విమానాల రాకపోకలపై అభ్యంతరం పెట్టిన విషయం తెలిసిందే.  దాంతో ఇరు కుటుంబాల వారు వీడియో కాల్ తో పెళ్లి చేయాలని భావించారు. ఈ క్రమంలో తౌసిఫ్ కుటుంబసభ్యులు షాజహాన్ పూర్ లోని వధువు ఇంటికి వెళ్లి పెళ్లి సమ్మతమేనంటూ ఆమెతో  అంగీకార పత్రంపై సంతకం చేయించుకున్నారు.

 

ఆపై, వీడియో కాల్ ద్వారా తౌసిఫ్ తో నిఖా జరిపించారు.  అంతా ఓకే అయిన తర్వాత తమ కూతురు ని అత్తారింటికి పంపుతామని అంటున్నారు పెద్దలు.  అయితే కరోనా ఎఫెక్ట్ తో ఇలాంటివి మరెన్ని చూడాలో అని అంటున్నారు నెటిజన్లు.  భారత్ లో ఇప్పటికే రెండు వందలకు పైగా కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే.  అంతే కాదు నిన్నటి వరకు ఐదుగురు మరణించారు.  కరోనా వైరస్ రాకుండా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: