యావత్ ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న ఎంతోమంది ప్రాణభయంతో బతికేలా చేస్తుంది కరోనా వైరస్. చైనాలోని వుహాన్  నగరంలో గుర్తించబడిన ఈ మహమ్మారి... ప్రస్తుతం చైనా దేశంలో కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ... ప్రపంచ దేశాలకు మాత్రం శరవేగంగా విస్తరిస్తూ విజృంభిస్తోంది. దీంతో ప్రపంచ దేశాల ప్రజలు అందరూ చిగురుటాకులా వణికిపోతున్నారు . ముఖ్యంగా ఇటలీ, ఇరాన్ లాంటి దేశాల్లో అయితే చైనా దేశం కంటే ఎక్కువ ప్రభావం చూపుతుంది. అక్కడ ప్రజలందరూ ఈ మహమ్మారి బారిన పడి భారీ సంఖ్యలో మరణిస్తున్నారు. రోజురోజుకు ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఇక ప్రపంచ దేశాలలో కూడా తక్కువేమీ లేదు ప్రపంచ దేశాల్లో ఎవరి నోట చూసిన ఈ కరోనా వైరస్ మాట వినిపిస్తోంది. ప్రతి ఒక్కరు ఈ మహమ్మారి వైరస్ పేరు ఎత్తితే చాలు వణికిపోతున్నారు. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ మహమ్మారి కరోనా వైరస్ ను ప్రపంచ మహమ్మారిగా గుర్తించింది.

 

 

 ఇక ఈ ప్రాణాంతకమైన వైరస్ కు  ఎలాంటి మందులు లేకపోవడం కేవలం నివారణ ఒక్కటే మార్గం కావడంతో ప్రజల్లో మరింత ప్రాణభయం పాతుకుపోతుంది. ఇక ఈ మహమ్మారి వైరస్ ఎన్నో దేశాలపై ప్రభావం చూపుతుంది. దీంతో క్రమక్రమంగా దేశాలన్నీ నిర్బంధంలోకి వెళ్ళిపోతున్నాయి. ఇక ప్రపంచం మొత్తం ఈ మహమ్మారిని తరిమికొట్టాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ప్రపంచ దేశాల ప్రజలు ఎన్నో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే దగ్గు, గొంతు నొప్పి. పొడి దగ్గు, కండరాల నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి లక్షణాలు వల్ల ఈ వ్యాధిని గుర్తించవచ్చు. 

 

 

 అయితే తాజాగా ఈ లక్షణాలకు మరిన్ని లక్షణాలు తోడయ్యాయి. తాజాగా జర్మన్ వైద్య నిపుణులు తెలిపిన ప్రకారం... కరోనా  వైరస్ బారిన పడిన వారిలో రుచి సామర్థ్యం కూడా బలహీనపడుతుంది. 60 శాతం మంది రోగులలో ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా తరచూ విరేచనాలు అవుతూ ఉండటం కూడా ఈ వ్యాధికి ఉన్న మరో లక్షణంగా జర్మన్ వైద్య నిపుణులు వెల్లడించారు. కరోనా  వైరస్ బారిన పడిన వారిలో 30 శాతం మందికి ఈ లక్షణం ఉంటుంది అంటూ తెలిపారు. కరోనా  వైరస్ సోకిన వ్యక్తులకు మొదట అలసట కండరాల నొప్పులు పొడిదగ్గు తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి. ఈ సమయంలో కొంతమందికి వాంతులు-విరేచనాలు కూడా అవుతూ ఉంటాయి అని జర్మనీ వైద్య నిపుణులు సూచించారు. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించడం మేలు అంటూ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: