ప్రస్తుతం ప్రపంచ దేశాలను గడగడలాడించి... ప్రజలందరినీ ప్రాణభయంతో చిగురుటాకులా వణికిస్తోంది కరోనా వైరస్. మొన్నటివరకు చైనా దేశంలో వెలుగులోకి వచ్చి  ఆ దేశంలో మరణ మృదంగం మోగించి ఎంతో మందిని పొట్టనబెట్టుకున్న ఈ మహమ్మారి... ఇప్పుడు చైనా నుండి ఇతర దేశాలకు శర వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇక ప్రపంచ దేశాలలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా రోజురోజుకు పరిస్థితి చేయి దాటి పోతుంది. ఇక కొన్ని కొన్ని దేశాలలో అయితే కరోనా వైరస్ మరణమృదంగం మోగిస్తుంది  అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ప్రపంచం మొత్తం దిగ్బంధం దిశగా వెళ్ళిపోతున్నది . ఇప్పటికే చాలా దేశాలు స్వీయ  దిగ్బంధం లోకి వెళ్ళిపోయి అన్ని నిషేధాజ్ఞలను కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. 

 

 

 

 ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఈ మహమ్మారి వైరస్ కు ఎలాంటి విరుగుడు మందు లేదని కేవలం నివారణ ఒక్కటే మార్గం అంటూ ప్రపంచ దేశాలకు సూచించడం... ఈ కరోనా  వైరస్ ను   ప్రపంచ మహమ్మారిగా గుర్తించడంతో రోజురోజుకు ప్రజల్లో ప్రాణభయం పాతుకు పోతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో దేశాలు స్వీయ  దిగ్బంధం లోకి వెళ్ళిపోయి కఠిన నిబంధనలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే.. ఇక గల్ఫ్ దేశాలలో కూడా కరోనా  వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ మహమ్మారి నిర్మూలనలో భాగంగా... గల్ఫ్ దేశమైన కువైట్ విదేశీయులను అరెస్ట్ చేసి దేశం నుంచి బహిష్కరించాలి అని  నిర్ణయించింది. కువైట్ లో ఉన్న వారిని స్వదేశాలకు పంపిస్తోంది. 

 

 

 ఇక ఈ క్రమంలోనే ఇటీవల ఏకంగా భారతీయులను  350 మందిని అరెస్టు చేసింది కువైట్ ప్రభుత్వం. ఇక వీరిని ప్రత్యేక విమానంలో భారత్ కు తరలించింది. ఇక వీరిలో 160 మందికిపైగా తెలుగువాళ్ళు ఉండడం గమనార్హం. వీరిలో ఎక్కువమంది కడప జిల్లా వాసులే అని సమాచారం. ఇంకో విషయం ఏమిటంటే కువైట్ ప్రత్యేక విమానంలో పంపిన వారిలో ఏకంగా రెండేళ్ల పాప కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ పాపకు జన్మనిచ్చిన తల్లి పాపను ఆసుపత్రిలోనే వదిలేసి పారిపోగా... తర్వాత ఆమెను గుర్తించిన పోలీసులు అరెస్టు చేసి జైలులో ఉంచారు. ఇక ప్రస్తుతం కరోనా  వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు విమానాల రాకపోకలను రద్దు చేసింది అక్కడి ప్రభుత్వం. ఇక 350 మంది భారతీయులతో కువైట్ నుండి భారత్ కు విమానం బయలుదేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: