ప్రపంచ దేశాల ప్రజలను బెంబేలెత్తిస్తూ ఎంతో  మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంది మహమ్మారి కరోనా  వైరస్. మొన్నటివరకు చైనాలో మరణ మృదంగం మోగించిన ఈ మహమ్మారి ప్రస్తుతం ప్రపంచ దేశాలకు శర వేగంగా వ్యాప్తి చెందుతూ అందరికీ ప్రాణ భయాన్ని కలిగిస్తుంది . ఈ వైరస్ వెలుగులోకి వచ్చి ఇప్పటికే రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఈ వైరస్ కు  సరైన విరుగుడు లేకపోవడంతో ప్రజల్లో  మరింత భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది శాస్త్రవేత్తలు ఈ వైరస్ కు  విరుగుడు కనిపెట్టేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సరైన ఫలితాలు మాత్రం రావడం లేదు. దీంతో ప్రపంచ దేశాలకు ఈ మహమ్మారి వైరస్ శర వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రపంచ దేశాల ప్రజలందరినీ చిగురుటాకులా వణికిస్తోంది. 

 

 ఇక ఈ మహమ్మారి వైరస్ ప్రస్తుతం భారతదేశంలో కూడా అడుగు పెట్టి ఎంతోమందికి ప్రాణభయం కలిగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారతదేశంలో 160 కి పైగా కరోనా  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రోజురోజుకి ప్రజల్లో  ప్రాణభయం పెరిగిపోతూ వస్తోంది. ఇక కరోనా  వైరస్ విజృంభిస్తుండడంతో ఒక్కసారిగా అప్రమత్తమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిబంధనలను అమలు లోకి వచ్చాయి. కరోనా  వైరస్ నియంత్రణకు ఇప్పటికే ఎన్నో రాష్ట్రాలు స్వీయ దిగ్బంధంలో కి కూడా వెళ్లిపోయాయి. 

 

 

 ఈ క్రమంలోనే కరోనా వైరస్ ను నియంత్రించేందుకు హర్యానా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించేందుకు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేయాలంటూ హర్యానా సర్కార్  అన్ని జిల్లాల మెజిస్ట్రేట్ లు పోలీస్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. అయితే బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురు కంటే ఎక్కువ గుమిగూడి నట్లు కనిపిస్తే... 144 సెక్షన్ కింద చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించింది హర్యానా హోంశాఖ. కరోనా  వైరస్ నివారణకు కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: