గతంలో టిడిపి పార్టీలో కొనసాగిన రేవంత్ రెడ్డి... ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ లోకి చేరి క్రియాశీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చూపు మొత్తం రేవంత్ రెడ్డి పైనే ఉండటంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మొదటినుంచి రేవంత్ రెడ్డి పైన కాస్త అసంతృప్తిగానే ఉన్నారు. కొన్ని కొన్ని సార్లు కాంగ్రెస్ లో అసంతృప్తి జ్వాలలు తెరమీద కూడా కనిపించాయి. ఇక తాజాగా మరోసారి సొంత పార్టీలోనే వివాదాలు తెరమీదకు వచ్చాయి. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మల్కాజ్ గిరి  ఎంపీ రేవంత్ రెడ్డి కేటీఆర్ ఫామ్ హౌస్ పై డ్రోన్ కెమెరాలు పంపించిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాను జైలులో ఉన్న సమయంలో తనను పరామర్శించేందుకు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాలేదు అంటూ ఎంపీ రేవంత్ రెడ్డి కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. 

 

 

 రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నో విలువలు ఉన్న వ్యక్తి అని వ్యాఖ్యానించిన జగ్గారెడ్డి ... తిమింగలాల వంటి నేతలు ఉన్నప్పటికీ పార్టీని నాలుగేళ్లుగా సమన్వయం చేస్తూ నడిపిస్తున్నారని ఆయన అన్నారు. జైలులో  ఎవరో  ఖైదీలు చెప్పారు అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డిని తప్పుపట్టడం సరైనది కాదు అంటూ ఆయన నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. జైలులో నీ సహా ఖైదీలు  ఏమి చెప్తే అది చేస్తావా... ఒకవేళ వారు నిన్ను  జైలులోనే ఉండిపోవాలి  అంటే ఉండిపోతావా అంటూ జగ్గిరెడ్డి రేవంత్ రెడ్డి ని ప్రశ్నించారు.

 

 

 అంతేకాకుండా రాష్ట్రంలో జరిగిన భూ అవినీతిపై పోరాడే బాధ్యతను పార్టీ తనకు అప్పగించిన అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన జగ్గా  రెడ్డి... దీనిపై పార్టీ కోర్ కమిటీలో కుంతియాను  అడుగుతాము అంటూ తెలిపారు. టీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజాయితీని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదు అంటూ తెలిపిన జగ్గారెడ్డి... కెసిఆర్ అవినీతిపై పార్టీ అధ్యక్షుడు అనుమతిస్తేనే పార్టీ పోరాడుతోంది అంటూ తెలిపారు. కేసిఆర్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారే అని... పార్టీ గురించి... తమకన్న ఆయనకు ఎక్కువ తెలుసు అంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: