ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారాలకు కత్తెర వేయటంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కమీషన్లో నిమ్మగడ్డ ఏకచత్రాధిపత్యం వహిస్తున్నారు. దాంతో  కమీషనర్ అధికారులు అపరిమితంగా ఉన్నాయి. ఆయనంత ఆయనగా సొంత బుద్ధితో నిర్ణయాలు తీసుకుంటే ఎవరికీ ఇబ్బందిగా ఉండకపోను. కానీ తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయ ప్రేరేపితాలుగాను, ఎవరో వెనుక నుండి నడిపిస్తున్నట్లుగానో ఉందనే అనుమానాలు రావటంతోనే సమస్యలు వస్తున్నాయి.

 

ఇక్కడ సమస్య ఇదే వచ్చింది. చంద్రబాబునాయుడు చెప్పినట్లుగానే నిమ్మగడ్డ నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలకు ఊతం వచ్చింది. ఎలాగంటే ఎన్నికల వాయిదా లాంటి పెద్ద నిర్ణయం తీసుకునేముందు కనీసం ప్రభుత్వంతో ఒక్క మాట కూడా మాట్లాడకుండానే  ప్రకటించేయటంతోనే అనుమానాలు బలపడ్డాయి. అందుకనే ఇటువంటి అపరిమితమైన అధికారాలకు కత్తెర వేయాలని జగన్ డిసైడ్ అయినట్లు సమాచారం.

 

ఏక వ్యక్తి కమీషనర్ స్ధానంలో ముగ్గురిని నియమించాలని జగన్ అనుకున్నాడట. నియమించాలంటే ఎలాగంటే పంచాయితీ రాజ్ చట్టంలో మార్పులు చేయటం ద్వారా ఏకవ్యక్తి ఛైర్మన్ స్ధానంలో ముగ్గురు కమీషనర్లను నియమించాలని డిసైడ్ అయ్యాడట. దీనికి చట్టంలో మార్పులు చేస్తే సరిపోతుందా ? అసెంబ్లీలో బిల్లు పాస్ చేస్తే సరిపోతుందా ? అనే న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయా అనే  విషయాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఎన్నికల కమీషనర్ గా పనిచేసిన మాజీ ప్రభుత్వ  ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డితో కూడా చర్చలు జరిపారు.

 

సరే జగన్ ఆలోచనలు,  నిర్ణయాలు ఏ విధంగా ఉన్నా న్యాయపరంగా అడ్డంకులు సృష్టించటానికి ప్రతిపక్షాలు, సంస్ధలు ఎలాగూ రెడీగా ఉంటాయి. అవసరం ఉన్నా లేకపోయినా జగన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని చంద్రబాబు అండ్ కో అదే పనిగా అడ్డ పడుతున్న విషయం అందరూ చూస్తున్నదే. అప్పుడు ఇదే విషయమై ఎల్లోమీడియా మాట్లాడుతూ ఎన్నికల కమీషన్లో ముగ్గురు కమీషనర్లను నియమించటం రాష్ట్రప్రభుత్వ పరిధిలో లేదని మొదలుపెట్టేసింది. మరి ఏమవుతుందో చూడాల్సిందే.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: