ప్రపంచ దేశాలను ప్రాణభయంతో వణికిస్తూ ఎంతోమంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంటుంది మహమ్మారి కరోనా వైరస్. కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ శర వేగంగా వ్యాప్తి చెందుతుంది. అయితే మొదట ఈ మహమ్మారి వైరస్ చైనాలోని వుహాన్ నగరంలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇకపోతే 2019 డిసెంబర్ నెలలో ఈ మహమ్మారి వైరస్ వెలుగులోకి వచ్చింది.ఈ వైరస్ పుట్టింది అని తెలియగానే ఈ ప్రాణాంతకమైన వైరస్ పై  ఇప్పటివరకు ఏకంగా 200 కు పైగా పరిశోధన పత్రాలు విడుదలయ్యాయి. అయితే ఈ వైరస్ ఎలా పుట్టింది ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై  పరిశోధనా పత్రాలలో వివిధ కారణాలు చెప్పారు. ప్రధానంగా అయితే... గబ్బిలం,  అలుగు నుంచి వచ్చింది అంటూ కొంతమంది... పాముల నుంచి వచ్చింది అని కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పారు. 

 

 

వుహాన్  నగరంలోని ఓ గుహలో గబ్బిలాల పై ఈ వైరస్ ఉంటే ఆ గబ్బిలాలను పాము తినడంతో... ఆ పామును చంపి చైనా వాసులు సరిగ్గా వండుకోకుండా తినడంతో ఈ వైరస్ సోకింది అని ప్రచారం ఉన్నప్పటికీ దీనికి సరైన ఆధారాలు మాత్రం లేవు. అయితే మొదట డిసెంబర్ లో 41 మందికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ కాగా.. ఇందులో 27 మంది హుబె ప్రావిన్స్ లోని మార్కెట్కు వెళ్లి చేపలు పాములు కొన్నవారు ఉండటం గమనార్హం. అయితే కరోనా  వైరస్ జన్యువులపై పరిశోధన చేస్తే 2019 నవంబర్ నెలలోనే ఈ మహమ్మారి వైరస్ పుట్టినట్లు మరో నిజం బయటపడింది. ఇక 2002లో ప్రబలిన సాంగ్స్ వైరస్ కు  కరోనా  వైరస్ దగ్గర లక్షణాలు కలిగి ఉండటం గమనార్హం . గతంలో 29 దేశాలకు వ్యాప్తి చెందిన సార్స్  వైరస్ ఏకంగా ఎనిమిది వేల మందికి పైగా వ్యాపించింది... 700 మందిని ఈ మహమ్మారి వైరస్ బారిన పడి చనిపోయారు. 

 

 

 అయితే శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు అంటే... రెండు రకాల సార్స్ వైరస్ లు కలిసి.. ప్రస్తుతం కరోనా వైరస్ అనే కొత్త వైరస్ పుట్టింది అంటున్నారు. మొదటిసారి వైరస్ గబ్బిలాల పై ఉంటే రెండవసారి వైరస్ మలేషియాలోని ఫ్రాంగోలిన్ లపై  ఉంది అంటున్నారు... ఈ రెండు రకాల జీవులపై ఉండే రెండు రకాల వైరస్ల వల్ల పుట్టిన కొత్త వైరస్ ఈ మహమ్మారి కరోనా వైరస్ అంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే ఇలా రెండు రకాల వైరస్ తో కలిపి కొత్త వైరస్ ఎలా ఏర్పడుతుంది అని కొంతమంది పరిశోధకుల ప్రశ్న. అయితే జన్యుపరమైన క్రమంలో ఇలా జరిగి ఉండొచ్చు అంటున్నారు. ఈ వైరస్ ల గోల ఏమిటో గానీ ప్రస్తుతం ప్రపంచ దేశాల్లోని ప్రజల ప్రాణాల మీదికి వచ్చింది ఈ మహమ్మారి వైరస్.

మరింత సమాచారం తెలుసుకోండి: