కరోనా వైరస్ కు సంబంధించి వార్తలు ఇచ్చేటప్పుడు సంయమనం పాటించాలని ఏపీ సీఎం జగన్ మీడియాకు సూచించారు. కరోనా వైరస్ కు సంబంధించి తప్పుడు వార్తలు ప్రచురించినా.. ప్రసారం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం విశాఖలో కరోనా వచ్చి ఓ వృద్దుడు చనిపోయాడంటూ కొన్ని ఛానళ్లలో వార్తలు వచ్చాయి. అయితే వాస్తవానికి అతడు చనిపోలేదు. దీంతో కాస్త గందరగోళం నెలకొంది.

 

 

అందుకే కరోనా వార్తల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సీఎం జగన్ సూచించారు. తప్పుడు వార్తలతో ప్రజల్లో భయాందోళనలు కలిగించొద్దని ఆయన సూచించారు. కరోనాపై అవగాహన పెంచాలని, అపోహలను తొలగించాలని సీఎం జగన్ తెలిపారు. ఆయన కరోనాపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా వస్తే మరణమేనన్న భయం వద్దని సీఎం ధైర్యానిచ్చారు. రాష్ట్రంలో మూడే పాజిటివ్‌ కేసులు ఉన్నాయని, విదేశాల నుంచి వచ్చినవాళ్లేనని జగన్ తెలిపారు.

 

 

కరోనా విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చి ఆందోళనకు గురి చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని జగన్ హెచ్చరించారు. కరోనా సాకుచూపి నిత్యావసరాల ధరలు పెంచితే తీవ్ర చర్యలు తీసుకుంటామని కూడా జగన్ తెలిపారు. జిల్లా టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు ప్రతిరోజూ పర్యవేక్షణ తప్పనిసరని అని జగన్ ఆదేశించారు. ఆర్టీసీ బస్సుల్లో శానిటైజేషన్‌ చేయాలని ఆదేశించారు.

 

 

కరోనా ఎదుర్కోవడంలో వలంటీర్ల సేవలు భేషుగ్గా ఉన్నాయని జగన్ కితాబిచ్చారు. స్థానిక ఎన్నికలు జరిగి ఉంటే ప్రజాప్రతినిధులు కూడా ఉండేవాళ్లని... కరోనా నివారణా చర్యల్లో భాగస్వాములయ్యేవాళ్లని జగ్ కామెంట్ చేశారు. ముందస్తు జాగ్రత్తల కోసమే స్కూళ్లకు సెలవులు, పార్క్‌లు, థియేటర్లు, మాల్స్‌, ఆలయాల మూసివేశామని వైయస్‌ జగన్ తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: