ప్రేమ అనేది ఎంతటి మొనగాడినైన కొంగున ముడి వేసుకుంటుంది..ప్రేమ కోసం ఎలాంటి యుద్దాన్ని అయిన చేసేలా చేస్తుంది.. అందుకే ప్రేమకు చాలా పవర్ ఉంది అంటున్నారు.. ఇకపోతే ప్రేమ కోసం రాజ్యాలను కోల్పోయిన రాజులు కూడా చాలా మందే ఉన్నారు.. ప్రేమ పేరుతో మోసపోయిన మహిళలు కూడా ఉన్నారు.. అందుకే ప్రేమకు చాలా పవర్ ఉంది అంటారు..ఇకపోతే ప్రేమ పేరుతో ఓ రాక్షసుడు ఓ నిండు ప్రాణాన్ని బలికొన్నారు.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..

 

 

వివరాల్లోకి వెళితే...ప్రేమోన్మాదానికి మరో యువతి బలైపోయింది. తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండల పరిధిలోని ఓ గ్రామంలో మహిళా గ్రామ వాలంటీరు గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామంలో నాయనమ్మ, తండ్రితో కలిసి నివసిస్తున్న యువతి గ్రామ వాలంటీరుగా ఉద్యోగం సాధించింది. అదే గ్రామంలో వాలంటీర్‌గా పనిచేసే మల్లాడి కృష్ణ అనే యువకుడు ఆమెను ప్రేమ పేరుతో సాదించేవాడు..

 

 

అయితే అతడి ప్రేమను ఆమె ఎంతకీ అంగీకరించక పోవడంతో ఆమె అనేక ప్రలోబాలకు గురిచేస్తూ వచ్చాడు ..దాంతో ఆమె ఎన్నో సార్లు తన వెంటపడవద్దని అతనికి హెచ్చరించింది..అయినప్పటికీ కృష్ణ వైఖరిలో మార్పు రాలేదు. తనను ప్రేమించకపోతే అంతు చూస్తానని తరుచూ వేధించడంతో ఆమె తట్టుకోలేకపోయింది. గురువారం అందరూ నిద్రపోయాక గదిలోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకుంది.ఈ విషయాన్ని గమనించి స్థానికులకు సమాచారం ఇచ్చారు.. వారు వచ్చి తలుపులు బద్దలు కొట్టగానే ఆమె ఫ్యాన్ కు ఉరివేసుకొని విగత జీవిగా కనిపించింది..

 

 

అయితే ఆమెను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.. అయితే అక్కడ పరీక్షించిన వైద్యుల ఆమె ఆసుపత్రికి రాక ముందే ఆమె ప్రాణాలను విడిచింది అని నిర్ధారించారు..ప్రభుత్వాసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలి తండ్రి  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: