తెలంగాణాలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తుంది. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 19 కేసులు నమోదు అయినట్టు అధికారులు గుర్తించారు. నిన్న ఒక్క రోజే మూడు కేసులు నమోదు కావడంతో కెసిఆర్ సర్కార్ అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. రెండు మూడు రోజుల్లోనే విదేశాల నుంచి వచ్చిన వారి కారణంగా కరోనా వైరస్ విస్తరిస్తుంది. ఇప్పటి వరకు తెలంగాణాలో ఉన్న ఎవరికి కరోనా వైరస్ సోకలేదు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికే ఈ వైరస్ ఉంది. ఇక ఒక్క మరణం కూడా తెలంగాణాలో నమోదు కాలేదు. సోకినా అందరి పరిస్థితి నిలకడగా ఉంది. 

 

ప్రస్తుతం ఇతర దేశాల వారికే కరోనా ఉండటంతో అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే విమానాలను ఇప్పటికే పూర్తి స్థాయిలో అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఎక్కడిక్కడ పక్కా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ప్రజల్లో దీనిపై తెలంగాణా ప్రభుత్వం అవగాహనా కార్యక్రమాలను కూడా చేపడుతుంది. ప్రస్తుతం తెలంగాణాలో కరోనా సోకినా వారి ఆరోగ్య పరిస్థితికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని అధికారులు చెప్తున్నారు. తెలంగాణా వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తంగా ఉంది. 

 

ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు. అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చెయ్యాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. దీనితో వైరస్ వ్యాప్తిని కట్టడి చేయవచ్చు అని భావిస్తున్నారు. ఇక తెలంగాణకు విదేశాల నుంచి వచ్చే వారిని హోం క్వారంటైన్ చేస్తున్నారు అధికారులు. ప్రముఖులు వచ్చినా సరే ఈ విషయంలో ఎక్కడా కూడా అలసత్వం ప్రదర్శించవద్దు అని కెసిఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు. ప్రస్తుతం తెలంగాణాలో కరోనా వైరస్ కట్టడి లోనే ఉంది. అయితే కరీంనగర్ లో మాత్రం కరోనా వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: