ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కరోనా వైరస్ భయమే కనిపిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలను ప్రాణభయంతో బెంబేలెత్తిస్తూ...  ఎంతోమంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంది ఈ మహమ్మారి కరోనా వైరస్. అయితే మొదట చైనాలో గుర్తించబడిన ఈ వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలకు శరవేగంగా పాకి పోతు  ఎంతోమందికి ప్రాణ భయం కలిగిస్తోంది. ఇక ప్రపంచ దేశాల్లో కూడా ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది ఈ మహమ్మారి. అయితే ప్రస్తుతం ప్రపంచ దేశాల్లోని కొన్ని దేశాల్లో అయితే ఈ మహమ్మారి వైరస్ విజృంభణ ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. కాగా కరోనా  వైరస్ విజృంభన నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన దేశాల్లో  స్పెయిన్ కూడా  ఒకటి అన్నది తెలిసిందే. 

 

 

 అయితే అటు భారతదేశంలో కూడా ఈ మహమ్మారి వైరస్ శరవేగంగా వ్యాప్తిచెందిన ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంది. ముఖ్యంగా విదేశాల నుంచి వస్తున్న వారిలో ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. విదేశాలలో మహమ్మారి వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటం కారణంగా విదేశాలకు చదువు ఉద్యోగం నిమిత్తం వెళ్ళిన వారు కరోనా  వైరస్ బారినపడి మళ్లీ ఇండియాకు తిరిగి రావడంతో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరుగుతుంది  ఈ క్రమంలోనే బుధవారం చదువుల కోసం స్పెయిన్ వెళ్లిన ఓ యువతి... కోల్కతాలోని సిలిగురి కి వచ్చింది. అయితే వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న స్పెయిన్ నుంచి వచ్చిన నేపథ్యంలో సదరు యువతిని ఇంటిలోనే నిర్బంధంలో ఉండాలని వైద్యులు సూచించారు. కానీ ఆమె వైద్యుల సూచన లను బేకాతారు  చేస్తూ... తన పెంపుడు కుక్కను తీసుకొని అక్కడి ప్రాంతమంతా వాకింగ్ చేసింది. దీంతో అక్కడి స్థానికుల్లో  భయాందోళనలు మొదలైపోయాయి.

 

 

 దీంతో వెంటనే స్థానికులు ప్రజా ప్రతినిధులకు అధికారులకు సమాచారం చేరవేయడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న అధికారులు ప్రజా ప్రతినిధులు యువతిని గృహ నిర్బంధం లోనే ఉండాలి అంటూ మరోసారి సూచించారు. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన ఆ యువతి కుటుంబ సభ్యులు అధికారులతో కాస్త అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం. స్పెయిన్ లో కరోనా  వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల ఆ యువతికి కరోనా  వైరస్ లక్షణాలు ఉండవచ్చు అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు వైద్యులు. ఈ నేపథ్యంలోనే ఆ యువతిని నిర్బంధంలో ఉండాలి అంటూ సూచించారు. అయితే ఈ విషయమై కుటుంబ సభ్యులకు తెలపడంతో కుటుంబ సభ్యులు అసభ్యంగా ప్రవర్తించగా ఆ యువతితో పాటు కుటుంబ సభ్యుల పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: