కరోనా వైరస్ నుంచి తమను తాము కాపాడుకునేందుకు జనం ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా చాలా మంది మాస్కులు కట్టుకుంటున్నారు. అయితే ఈ మాస్కులు వినియోగంపై చాలా మందికి అవగాహన ఉండటం లేదు. అవగాహన లేకుండా మాస్కులు వాడితే ఉపయోగం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని నిపుణలు చెబుతున్నారు.

 

 

అసలు మాస్కు ఎప్పుడు ధరించాలో తెలుసుకుందాం.. మీ ఆరోగ్యం బాగుగా ఉండి, COVID-19 సంక్రమించినట్టు అనుమానం ఉన్న వ్యక్తికి మీరు సపర్యలు చేస్తూ ఉంటే మాస్క్ ధరించాలి. మీకు దగ్గు లేదా తుమ్ము ఉంటే ధరించాలి. మూడు అడుగుల సామాజిక దూరాన్ని పాటించడం కుదరని బస్సు, ట్రెయిన్ లో ప్రయాణిస్తున్నప్పుడు మాత్రమే మాస్క్ దాటించాలి.

 

 

ఇవేమీ లేనప్పుడు, ఇంటిలో ఉండగా మాస్క్ అవసరం లేదు. ఆల్కహాల్ ఆధారిత సానిటైజర్ లేదా సబ్బు మరియు నీటితో చేతిని శుభ్రపరచుకున్నాకే మాస్క్ ని తాకాలి. లేకుంటే, చేతికి ఉన్న వైరస్ మాస్క్ కి అంటుకొని వైరస్ శరీరంలోకి ప్రవేశించవచ్చు. మాస్క్ తో నోరు మరియు ముక్కును పూర్తిగా కప్పండి. మరియు మీ ముఖం మరియు ముసుగు మధ్య ఖాళీ లేకుండా చూసుకోవాలి. మాస్క్ వేసుకున్నాక దాన్ని తాకడం మానుకోండి. ఒక వేళ తాకితే ఆల్కహాల్ ఆధారిత సానిటైజర్ లేదా సబ్బు మరియు నీటితో చేతులను శుభ్రం చేసుకోవాలి.

 

 

మాస్క్ తడిగా ఉంటే అది పడేసి కొత్తది వేసుకోండి. సింగిల్-యూజ్ మాస్క్‌లను తిరిగి ఉపయోగించవద్దు. మాస్క్ తొలగించడానికి తాళ్లను పట్టుకొని మాత్రమే తొలగించాలి. మాస్క్ ముందు భాగంలో తాకవద్దు. మూత ఉన్న చెత్త డబ్బాలో వెంటనే పడేసి, ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ రబ్ లేదా సబ్బు మరియు నీటితో చేతులు శుభ్రం చేయండి. ఈ సూచనలు తప్పక పాటించండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: