కరోనా భయం ప్రపంచాన్ని వణికిస్తోంది. ఏపీలోనూ ఆ వణుకు కనిపిస్తోంది. అయితే ఈ సయమంలో చంద్రబాబు సీఎంగా ఉంటే ఎలా ఉంటుందో.. దీన్ని తన ప్రచారానికి ఎలా వాడుకుంటాడో సెటైరికల్ గా చెబుతూ వైసీపీ సోషల్ మీడియా పంచులేస్తోంది. మొన్నటికి మొన్న జగన్ ను పారసిట్మాల్ సీఎం అని టీడీపీ సోషల్ మీడియా చేస్తున్న వెటకారానికి కౌంటర్ ఇస్తోంది.

 

వైసీపీ సోషల్ మీడియా సెటైర్ ఏంటో చూడండి..

 

మా బాబే సీఎంగా ఉంటే ఇప్పుడెన్ని చేసేవాడో...అంటూ పచ్చదండు పగటి కలల్లో తేలిపోతోంది.. బాబుండుంటే ఏ జరిగుండేదో.. జనాలనడిగితే ఇదిగో ఇలా చెప్పారు..

 

చేతిలో నాన్చాక్ తో ఫుల్ సైజ్ కటౌట్ ఒకటి రాష్ట్రం నలుమూలలా పెట్టేవాళ్లు..దానికి కాప్షన్ గా కరోనాతో కరాటే ఆడుతున్న ఛండ్రబాబు అని పెట్టేవాళ్లు.. రోడ్డుకీ ఆ పక్కా ఈ పక్కా పెద్ద హోర్డింగుల్లో కరోనా మళ్లీ రావాలి...బాబే దాన్ని కంట్రోల్ చేయాలి అని రాసేవాళ్లు..

 

మాస్కుల మీద సైకిల్ గుర్తేసి చంద్రబాబు ఫొటోలేసి ఒకటీ వందరూపాయిలకు ఊళ్లల్లో అమ్మేవాళ్లు.. ప్రతి గంటకూ ప్రెస్ మీట్ పెట్టి కరోనాను కరకట్టలో కట్టిపడేసాను...కోవిడ్ ని కుప్పంలో కప్పెట్టేసాను అని చెప్పుకునేవాడు. కులనాడు, కులజ్యోతుల్లో ఫ్రంట్ పేజీలో కరోనిరోధకుడు, నారా చేతిలోకరోనా విలవిల లాంటి భారీ హెడ్డింగులు వచ్చేవి. బాబే కరోనా కర్కోటకుడంటూ కుల తోకలు నిప్పంటించుకుని రాష్ట్రమంతా తిరిగేవి.

 

 

పచ్చ పెయిడ్ సోషల్ మీడియా అంతా కరోనా వాళ్ల కళ్లముందుకు ఎలా వచ్చిందీ...బాబు దాన్ని కంటిచూపుతో ఎలా ఆపాడు అని కథలు కథలుగా వివరించి చెప్పేవారు. దిల్లీ నుంచి మోదీ ఫోన్ చేసి కరోనా కంట్రోల్ బోర్డుకు అధ్యక్షుడిగా ఉండమని బాబును ప్రాధేయపడేవాడు. నేషనల్ మీడియాలో నారాసిట్మాల్ గురించి హోరెత్తిపోయేది. అమెరికాలో ట్రంపు, ఐక్యరాజ్యసమితి అధ్యక్షులు కరోనాపై కథ చెప్పేందుకు బాబును ఆహ్వానించేవాళ్లు.. ఇదే జరిగేది...”

మరింత సమాచారం తెలుసుకోండి: