ప్రస్తుతం ప్రపంచ దేశాలలో ఆ ఒక్కటే చర్చనీయాంశంగా మారిపోయింది. అదే  ప్రపంచ దేశాలకు శర వేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతోమంది మనుషుల ప్రాణాలను బలితీసుకుంది.. ఇంకా ఎంతో మందిని మృత్యువుతో పోరాడేలా చేస్తున్న ప్రాణాంతకమైన మహమ్మారి వైరస్ కరోనా  గురించి. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ తో పోరాటం చేస్తున్నాయి. ఈ వైరస్ కి సరైన విరుగుడు కూడా లేకపోవడంతో ప్రస్తుతం శరవేగంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతూ విజృంభిస్తుంది. ముందుగా చైనాలో గుర్తించబడిన ఈ మహమ్మారి వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను ప్రాణభయంతో చిగురుటాకులా వణికిస్తోంది . 

 

 

 ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలలో వ్యాపించి.. ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది. ఇక ఇప్పటికే అమెరికా లో కూడా కరోనా  వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన నిబంధనలను అమలు లోకి తెస్తూన్నారు. ఇక తాజాగా ఏకంగా డోనాల్డ్ ట్రంప్ చెంతకు చేరింది కరోనా  వైరస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో తొలి కరోనా  పాజిటివ్ కేసు నమోదయింది. అమెరికా దేశ ఉపాధ్యక్షుడు అయినా మైక్ పెన్స్  బృందంలోని ఓ వ్యక్తికి... కరోనా  వైరస్ లక్షణాలు ఉండడంతో పరీక్షలు నిర్వహించగా ఈ మహమ్మారి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. 

 

 

 దీంతో ఒక్కసారిగా అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. అతను గత కొన్ని రోజులుగా ఎవరెవరిని కలిశాడు... ఏం చేసాడు అన్న దానిపై ఆరా తీస్తున్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కానీ ఉపాధ్యక్షుడు తో కానీ కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిన వ్యక్తి నేరుగా కలవలేదని తేలడంతో అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ మధ్య కాలంలో అతడు కలిసిన వారిని గుర్తించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది. అంతకు ముందు వరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలిసిన వ్యక్తులలో కూడా కరోనా  వైరస్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో... ఏకంగా అమెరికా అధ్యక్షుడు సైతం కరోనా  వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. అయితే ప్రస్తుతం అమెరికా లో కరోనా  వైరస్ విజృంభించడంతో రోజురోజుకు మృతుల సంఖ్య పెరిగి పోతున్న విషయం తెలిసింది. 230 మంది అమెరికాలో ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ మహమ్మారి వైరస్ బాధితుల సంఖ్య 18 వేల వరకు దాటిపోయింది. దీంతో అప్రమత్తమైన డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆర్మీ రంగంలోకి దింపి అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: