వామ్మో వామ్మో... ఈ కరోనా వైరస్ భారత్ ను వణికించేస్తోంది. ఇప్పటికే ప్రపంచాన్ని వణికించిన ఈ కరోనా వైరస్ భారత దేశంలో జాడలు విప్పుతుంది. అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఈ కరోనా వైరస్ ను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. అయినప్పటికీ ఈ కరోనా మహమ్మారి పంజా విసురుతుంది. 

 

చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ భారత్ లోకి ప్రవేశించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ తెలంగాణలోనూ రోజు రోజుకు భారీగా పెరిగిపోతుంది. ఇక తాజాగా ఈ కరోనా వైరస్ నేపధ్యంలో వివిధ దేశాల నుంచి నగరానికి వచ్చిన వారి సంఖ్య తెలిస్తే హైదరాబాదిలు హైదరాబాద్ ను వదిలి పారిపోతారు. 

 

విదేశాల నుండి పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రయాణికులు ఐసోలేషన్ ప్రక్రియను విస్మరించి ప్రజల్లో కలిసినట్టు వార్తలు వస్తున్నాయ్. దీంతో ఇప్పుడు ఏ మూల నుండి ఏ ఉపద్రవం వచ్చి పడుతుందోనన్న ఆందోళన అధికార యంత్రంగంలో నెలకొన్నట్టు సమాచారం. ఇంకా హైదరాబాద్ లో ఎలాంటి ప్రజలు ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

 

ఈ హైదేరాబద్ లో ఒక్క దేశవ్యాప్తంగా ప్రజలే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల్లో ఎంతోమంది ఇక్కడికి వచ్చి నివసిస్తుంటారు. ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ కారణంగా కేవలం అంటే కేవలం ఒక్క నెలలలోనే ఏకంగా 69వేలమంది కంటే ఎక్కువమందే ప్రయాణికులు హైదరాబాద్ కు చేరినట్టు సమాచారం. 

 

కరోనా ఉదృతమై వందలాదిగా కేసులు నమోదైన యూరప్‌లోని ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్‌ వంటి దేశాల నుండి కేవలం 10 రోజుల్లో 540మంది నగరంలోకి ప్రవేశించినట్టు వారిలో కొందరు మాత్రమే ఐసోలేషన్ సెంటర్ కు వెళ్లినట్టుగా అధికార లెక్కలు చెప్తున్నాయ్. కాగా ఈ వచ్చే 15 రోజులు జాగ్రత్తలు తీసుకోకుంటే ఇబ్బందులు తీవ్రంగా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: