కరోనా వైరస్ విస్తరణ నేపధ్యంలో పలు కంపెనీలు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాయి. ఎక్కడిక్కడ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. నష్టాలు వచ్చినా సరే ఎక్కడా కూడా వెనక్కు తగ్గడం లేదు. ఇప్పటికే పలు ఐటి కంపెనీలు వర్క్ ఫ్రొం హోం ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు అన్నీ ఐటి కంపెనీలు కూడా వర్క్ ఫ్రొం హోం ప్రకటించి తమ ఉద్యోగులను ఆఫీసులకు రావొద్దని ప్రకటించాయి. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు గాను ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలను అన్ని కంపెనీలు పాటిస్తూ వస్తున్నాయి. 

 

ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో ప్రముఖ ట్రాన్స్ పోర్ట్ సంస్థ ఓలా కీలక నిర్ణయం తీసుకుంది. షేర్ రైడ్ ని రద్దు చేసింది ఆ సంస్థ. వాస్తవానికి షేర్ రైడింగ్ ద్వారా నలుగురు వరకు ప్రయాణించే అవకాశం ఉండేది. దీనితో ధర తక్కువగా ఉండేది. కాని ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం ఒక్కరు మాత్రమే క్యాబ్ లో ప్రయాణించే అవకాశం ఉంటుంది. దీనితో ధర ఎక్కువగా వసూలు చేసే అవకాశం ఉంది. రోనా వైరస్ ప్రభలకుండా ఉండేందుకు సోషల్ డిస్టాన్స్ పాటించమని కేంద్ర ప్రభుత్వం సూచించడంతో తాత్కాలికంగా ఈ సర్వీసుని రద్దు చేసింది. 

 

త్వరలోనే దాన్ని పునరుద్దరిస్తామని చెప్పింది ఓలా సంస్థ. ఇకపై తమ క్యాబ్‌లలో ప్రయాణించేవారు, ఒక్కరు లేదా ఒకే కుటుంబానికి చెందిన వారే ప్రయాణించేలా చేస్తున్నామని సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ విధానం తమ మైక్రో, మినీ, ప్రైమ్, రెంటల్ కార్లు, ఔట్ డోర్ సర్వీసులు అన్నింటిలో వర్తిస్తుందని ఆ ప్రకటన లో తెలిపింది. కేర్ టీమ్స్, సేఫ్టీ రెస్పాన్స్ టీమ్స్ 24 గంటలూ అందుబాటులో ఉంటాయని వివరించింది.  ఓలా సర్వీసులు కరోనా తర్వాత భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. 50 శాతం వరకు డిమాండ్ తగ్గిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: