కరోనా ఇప్పుడు అందరిని కలవరా పెడుతున్న వైరస్. ఏది ఒక్కవైపు ప్రపంచ దేశాలను వణికిస్తూనే.. మరో వైపు ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా దెబ్బకొడుతోంది. చైనాలో పుట్టిన కరోనా ప్రపంచాన్ని పిడికిట్లో పట్టేసింది. 183 దేశాలను చుట్టేసింది. పుట్టుకకు కారణమైన దేశంలో అది ఇప్పుడిప్పుడే చస్తున్నా, మిగతా దేశాల్లో మాత్రం జనాల్ని చంపేస్తోంది. 

 

ముఖ్యంగా ఇటలీ,ఇరాన్​లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అమెరికాలో చిన్నగా మొదలై ఒక్కసారిగా పెనుతుఫానులా ముంచెత్తింది. స్పెయిన్​లో ‘పవర్​’ వైరస్​, కరోనా వైరస్​ చెలరేగడానికి కారణమైంది. ఈ వైరస్ సోకని దేశాలు మాత్రం ఈ రాక్షస వైరస్ తమ దేశానికి సోకుండా ఉండాలని ప్రార్థిస్తున్నారు.దాని కోసం తగిన చర్యలు తీసుకుంటున్నారు. 

 

ఇటలీ అందమైన సిటీలకు పెట్టింది పేరు. జలజలా పారే కాల్వలు, ఆ కాల్వల్లో మనుసును హాయిగొలిపే ప్రయాణాల వెనిస్​.. రాజుల కాలంలో ఎన్నెన్నో సభలకు నిలయమైన కలోజియం ఉన్న రోమ్​.. ఫ్యాషన్​కు మారుపేరైన మిలాన్​.. ప్రపంచ అద్భుతం లీనింగ్​ టవర్​ను తనలో దాచుకున్న పీసా వంటి సిటీలు ఆ దేశంలోనే ఉన్నాయి. అందమైన ఆ దేశం కాస్తా కరోనా వల్లకాడులా మారుతోంది.

 

మరోవైపు ప్రస్తుతం యూరప్​లో ఇటలీ తర్వాత ఎక్కువగా ఎఫెక్ట్​ అయిన దేశం స్పెయిన్​. ఓవరాల్​గా ఎక్కువ కేసులు నమోదైన మూడో దేశం.  ఆ దేశానికి ‘అధికారం’ అనే మరో వైరస్​, కరోనా వైరస్​ విజృంభణకు కారణమైంది.  ప్రస్తుతం అక్కడ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. 

 

ఒక్కరోజులోనే 1,500 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో వైరస్ బాధితుల సంఖ్య 5,753కు చేరుకుంది. అందులో దాదాపు 3,000 మంది దేశ రాజధాని మాడ్రిడ్ లోనే ఉన్నట్లు ఆ దేశ ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. వైరస్ బారినపడ్డవారిలో శుక్రవారం వరకు 120 మంది ప్రాణాలు కోల్పోయారు.

 

ఒకేరోజు భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో ఆ దేశ కాబినెట్ అత్యవసరంగా భేటీ అయింది. కేసులు 47 వేలు దాటాయి. 4,032 మంది చనిపోయారు. చనిపోయినోళ్లను సొంతూళ్లలో ఖననం చేసే పరిస్థితి కూడా లేదు. అసలు శ్మశాన వాటికల్లో చోటే లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: