చైనా దేశంలోని వుహాన్ నగరంలో మొట్టమొదటి కరోనా కేసు నమోదయ్యిందని ఆ తరువాత కరోనా ప్రపంచమంతటా విస్తరించిందని అందరికీ తెలుసు. కానీ ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ... చైనాలో కంటే ఇతర దేశాల్లోనే వైరస్ కారణంగా ఎక్కువ మంది చనిపోయారు అని వెల్లడించింది. అనంతరం చైనా విదేశాంగ అధికార ప్రతినిధి మాట్లాడుతూ... అమెరికా సైన్యమే కరోనా వైరస్ ని తీసుకొచ్చిందని సంచలన ఆరోపణలు చేశాడు. దాంతో చిర్రెత్తిన అమెరికా... చైనాని బుద్దిని దుయ్యబడుతూ వైరస్ విజృంభణకు సంబంధించిన నిందని తమ మీదకు కావాలనే చైనా వేస్తుందని మండిపడింది.



ఈ క్రమంలోనే అగ్రరాజ్య అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా చైనా పై విరుచుకుపడ్డారు. ట్రంప్ ఇంతకుముందు కరోనా వైరస్ ని చైనా వైరస్ గా పిలిచిన విషయం తెలిసిందే. మళ్లీ శుక్రవారం రోజు వైట్ హౌస్ ప్రాంగణంలోని మీడియా సమావేశంలో మాట్లాడుతూ... చైనా పై విమర్శలు గుప్పిస్తూ... చైనా వల్లనే ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచమంతటా విస్తరించింది. వైరస్ గురించి సమాచారం వెంటనే ప్రపంచ దేశాలకు తెలియనివ్వకుండా దాచిపెట్టి అందర్నీ నానా ఇబ్బందులు పడేలా చేస్తుంది. వుహాన్ నగరంలో కరోనా వైరస్ ని గుర్తించిన వెంటనే దాన్ని ఆరంభంలోనే కట్టడి చేసినట్టయితే, ఆ ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి సంక్రమించకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇప్పుడు ప్రపంచం భారీ మూల్యం చెల్లించకపోయేది. కరోనా మహమ్మారి తీవ్రతను ఇతర దేశాలకు తెలియనివ్వకుండా అక్కడి వైద్యులను, మీడియా సంస్థలను తొక్కి పట్టింది చైనా. ఇలా చేసినందుకు చైనా కచ్చితంగా బాధ్యత వహించాలి' అంటూ తీవ్రస్థాయిలో చైనా తీరుని విమర్శించారు.




ఇకపోతే రెండు నెలల క్రితం ట్రంప్ మాట్లాడుతూ... చైనా కరోనా వైరస్ వ్యాప్తి ని నియంత్రించడంలో అద్భుతమైన చర్యలు తీసుకుంటుందని కొనియాడారు. కానీ చైనా మాత్రం కరోనా విజృంభణకు అమెరికా సైన్యమే కారణమనే ఆరోపణలు చేసే సరికి డోనాల్డ్ ట్రంప్ ఈ విధంగా ప్రపంచం మొత్తం అనుకుంటున్న విషయాలను చెప్పి చైనాని చిన్నబోయేలా చేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: