ఏ దుర్మూహుర్తంలో కరోనా చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిందో కాని.. ఇప్పుడు మనిషి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.  ప్రపంచం మొత్తం ఎంత టెక్నాలజీతో ముందుకు సాగుతున్నా.. భూమి, ఆకాశం, సంముద్రాన్ని శాసించగల స్థాయికి మనిషి చేరుకున్నా.. ఇప్పుడు కరోనా వైరస్ కి భయంతో వణికిపోతున్నాడు.  ఈ భయంకరమైన వైరస్ కి యాంటీ డోస్ ఇప్పటి వరకు కనిపెట్టలేక పోతున్నారు.  కరోనా పాజిటివ్ కేసులు నమోదైన అన్ని దేశాలూ, కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నా, ప్రజల సహకారం లేక, వ్యాధి విస్తరిస్తోందని, చైనా తరహాలో వైరస్ అణచివేత కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్ఓ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

 

స్పెయిన్ లో 165, ఇరాన్ లో 149 మంది మృతి చెందారని ఇటలీలో మొత్తం మృతుల సంఖ్య చైనాను దాటి 3,800కు చేరువైందని వెల్లడించారు.  ఇప్పుడు ఈ కరోనా ప్రభావం ఎక్కువగా ఇటలీలో ఉంది. నిన్న ఒక్క రోజే ఆ దేశంలో కరోనా మహమ్మారి కారణంగా ఏకంగా 627 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో, ఆ దేశంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,032కి చేరుకుంది. కరోనా వైరస్ వల్ల అక్కడ అన్ని మూసి వేసి ఇళ్లకే పరిమితం అయ్యారు. అయినా కూడా పలు చోట్ల ఈ కరోనా వైరస్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.  కరోనా ప్రభావంతో ఇటలీలో ఇప్పుడు చైనాను మించి మరణాలు సంబవిస్తున్నాయి.

 

ప్రపంచంలో ఎక్కువ కరోనా మరణాలు సంభవించిన దేశంగా నిలిచింది. కరోనాను కట్టడి చేయడం ఇప్పుడు ఆ దేశానికి పెను సవాల్ గా నిలిచింది. పరిస్థితి పూర్తిగా చేజారి పోవడంతో... ఆ దేశ ప్రభుత్వం నిస్సహాయ స్థితిలోకి జారిపోయింది.  వీలైనంత వరకు అక్కడ కరోనా ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టామని వైద్యాధికారులు అంటున్నారు.  ఇప్పుడు ఈ కరోనా భారత దేశంలో కూడా భయాన్ని సృష్టిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: