ప్రస్తుతం ప్రపంచ దేశాలకు శరవేగంగా విస్తరిస్తూ ఎంతోమంది ప్రాణాలను పొట్టన పెట్టుకుని... ఇంకెంతో మంది ప్రాణభయంతో వణికిస్తున్న మహమ్మారి వైరస్ ప్రస్తుతం భారతదేశంలో కూడా ప్రజలని బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న తరుణంలో భారత ప్రజల్లో ప్రాణభయం పాతకు పోతూ ఉంది. ఈ వైరస్ కు  సరైన నివారణ కూడా లేకపోవడంతో.. ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. భారత్ లో  ఇప్పటికే రెండు వందలకు పైగా కరోనా  పాజిటివ్ కేసులు నమోదు కావడం రోజురోజుకు ఈ కరోనా  బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయిపోయాయి. ఇక ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కఠిన నిబంధనలు అమలులోకి తెస్తూ  కొంచెంకొంచెంగా రాష్ట్రాన్ని ఇబ్బందుల్లోకి తీసుకెళ్తున్నారు.

 

 

 ఈ క్రమంలోనే తమిళనాడు సర్కార్ కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడు సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ నుంచి వాహనాల రాకపోకలను మార్చి 31 వరకు నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది తమిళనాడు సర్కారు. కేవలం నిత్యావసర వస్తువుల వాహనాలు అత్యవసర వైద్య సేవల వాహనాలు తప్ప మిగతా వాహనాలను తమిళనాడు సరిహద్దులో నుంచి రాష్ట్రంలోకి అనుమతించ వద్దు అంటూ ఆదేశాలను జారీ చేసింది. అయితే కరోనా వైరస్ ను నియంత్రించేందుకు ప్రజల సహకారంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించిన నేపథ్యంలో తమిళనాడు సర్కార్ ఈ  సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

 

 

 నిన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో... తమిళనాడు ముఖ్యమంత్రి పళనస్వామి... తమిళనాడు ఆరోగ్య శాఖ కార్యదర్శి బిల్లా రాజేష్ పాల్గొన్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీతో వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన వెంటనే తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర సరిహద్దులలో ఇతర రాష్ట్రాల వాహనాలను  అనుమతించబోమని అంటూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేసే వారి కోసం తక్కువ సంఖ్యలో బస్సులు నడుపుతామని తెలిపింది. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ప్రజలందరూ సహకరించాలి అంటూ ఈ సందర్భంగా ప్రభుత్వం తమిళనాడు ప్రజలకు పిలుపునిచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: