బంగ్లాదేశ్ లో సమూహిక ప్రార్థనాలు నిర్వహించడంపై ఆందోళన కనిపిస్తోంది. బుధవారం కరోనా నివారణ కోసం వేలాది మంది జనం... ఒకేచోట గుమిగూడి ప్రార్థనలు చేశారన్న వార్త వైరల్ అవుతోంది. దాదాపు 30 వేల మంది జనం ఈ ప్రార్థనల్లో పాల్గొనట్టుగా తెలుస్తోంది. అయితే వీరెవరూ కూడా మాస్కులు లేకుండా కనీస జాగ్రత్తలేవీ పాటించలేదని సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మాది విస్తరిస్తుండడంతో.... ఖురాన్ లోని స్వస్థల వ్యాఖ్యల పఠనం కోసం రాయపూర్ పట్టణంలో వీరంతా సమూహిక ప్రార్థనలు నిర్వహించారని తెలుస్తోంది.

 

 

 

ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో సామూహిక ప్రార్థనలపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల మలేసియాలో ఒక మత కార్యక్రమంలో పాల్గొన్న వారిలో దాదాపు 500 మందికి పైగా కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఆ కార్యక్రమంతో పొరుగు దేశాలైన బ్రూనై, సింగపూర్, కంబోడియాల్లోనూ కొంత మందికి వైరస్ సోకింది. దీంతో మలేసియా ప్రభుత్వం దేశంలో ఎక్కువ మంది హాజరయ్యే అన్ని రకాల సమావేశాలనూ నిషేధించింది. వైరస్ మరింతగా విస్తరించకుండా ఉండటానికి సరిహద్దులను మూసివేసింది. ఇండొనేసియాలో కూడా ఈ వారాంతంలో జరగాల్సిన ఇదే తరహా సామూహిక మత కార్యక్రమాన్ని.. వైరస్ భయంతో రద్దు చేసింది అక్కడి ప్రభుత్వం. 

 

 


ఇప్పటి వరకూ బంగ్లాదేశ్ లో 17 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. అయితే ఈ సంఖ్య మీద కూడా చాలా మంది నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాయపూర్ సామూహిక ప్రార్థనా కార్యక్రమాన్ని నిర్వహించటానికి అధికారుల నుంచి సంబంధిత నిర్వాహకులు ఎలాంటి అనుమతి తీసుకోలేదని తెలుస్తోంది. నిజానికి బంగ్లాదేశ్‌లో ఇటువంటి స్థానిక సమావేశాలు, సాముహిక ప్రార్ధనల నిర్వహణకు అధికారిక అనుమతులు తీసుకోవడం చాలా అరుదు. ముస్లిం జనాభా ఎక్కువగా నివసించే దేశం కావడంతో ఇక్కడ ఇలాంటి సామూహిక ప్రార్థనలు నిర్వహించడం సర్వ సాధారణం.

మరింత సమాచారం తెలుసుకోండి: