ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. ఇంకా ఈ నేపథ్యంలోనే క్రికెటర్లలో కరోనా వైరస్ తొలి పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. స్కాట్లాండ్‌కి చెందిన మజిద్ హక్‌ తాను కరోనా వైరస్ బారిన పడినట్లు అధికారికంగా ప్రకిటించాడు. దీంతో అతని అభిమానులు అంత తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

కరోనా వైరస్ లక్షణాలు అతనిలో కనిపించడంతో అతను గ్లాస్గోలోని రాయల్ అలెగ్జాండర్ ఆసుపత్రికి వెళ్లి పరిక్షలు చేయించుకోగా అతనికి కరోనా పాజిటివ్ అని వైద్యులు తేల్చారు. దీంతో అతన్ని ఐసోలేషన్‌ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా అతను మాత్రం త్వరలోనే మైదానంలోకి అడుగుపెడుతా అని ధీమా వ్యక్తం చేశాడు.   

 

కాగా క్రికెటర్స్ లో కరోనా వైరస్ సోకినా మొదటి వ్యక్తి ఇతనే.. గత సంవత్సరం వన్డేల్లో 60 వికెట్లు పడగొట్టిన మజిద్ హక్.. ఆ దేశం తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకూ స్కాట్లాండ్ తరఫున 54 వన్డేలు, 21 టీ20 మ్యాచ్‌లను మజిద్ హక్ ఆడాడు. అతనికి కరోనా వైరస్ సోకింది అని అతనే ప్రకటించడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: