ప్రధానమంత్రి నరేంద్రమోడి చెప్పినట్లు కరోనా వైరస్ విషయంలో జనతా కర్ఫ్యూ పాటిస్తే ఏమవుతుంది ? ఏమీ అద్భుతాలు జరిగిపోదు. కానీ జనాలంతా ఎవరిళ్ళల్లో వాళ్ళే కూర్చుంటే కనీసం మనిషి నుండి మనిషికి వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు కనీసం ఒక్క రోజైనా ఆగిపోతుందంతే. ఇది చాలు వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు. పైగా ఉదయం నుండి సాయంత్రం వరకూ  జనతా కర్ఫ్యూ పాటిస్తే ఎవరికైనా  వైరస్ సోకిఉంటే ఆ వైరస్ చనిపోతుందనే ప్రచారం విపరీతంగా జరుగుతోంది.

 

వైరస్ 12 గంటలకన్నా బతకదు కాబట్టే మోడి ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకూ జనతా కర్ఫ్యూ పాటించని కోరినట్లు తప్పుడు ప్రచారం జరుగుతోంది. నిజానికి ఎవరికైనా వైరస్ సోకితే అది 12 గంటల్లోనో లేకపోతే ఒక్క రోజులోను చనిపోదని ఇప్పటికే శాస్త్రజ్ఞులు నిరూపించారు. శాస్త్రజ్ఞులు చెప్పేదాని ప్రకారం రాగి వస్తులపై వైరస్ 4 గంటల పాటు మనుగడలోనే ఉంటుంది.  ప్యాకేజింగ్ కు వాడే అట్టపెట్టలపై 24 గంటలు బతికే ఉంటుందిట.

 

అలాగే ప్లాస్టిక్, స్టైన్ లెస్ స్టీలు వస్తులపై 3 రోజులు, అల్యూమీనియం, చెక్క, పేపర్ పై వైరస్ 5 రోజులు జీవిస్తుందట. అంటే రోగులు కానీ లేదా అనుమానితులు కానీ 14 రోజుల పాటు ఎవరినీ కలవకుండా ఇంట్లోనో, ఐసొలేషన్ వార్డుల్లోనో అది కాకపోతే క్వారంటైన్ సెంటర్లలోను ఉన్నంత మాత్రాన వైరస్ పోదు. వైరస్ సోకిందని నిర్ధారణ కాగానే దానికి తగ్గట్లుగా వైద్యం చేయించుకుంటేనే కరోనా వైరస్ పోతుంది.

 

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వైరస్ సోకిన తర్వాత చికిత్స చేయించుకునే కన్నా సోకకుండా తీసుకునే ముందు జాగ్రత్తలే చాలా మంచిది. అందుకనే  జనతా కర్ఫ్యూ పాటించమని నరేంద్రమోడి  జనాలందరినీ కోరింది. రెండోస్టేజిలో ఉన్న వైరస్ ప్రభావం మూడో స్టేజికి వెళ్ళకూడదనే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అవస్తలు పడుతున్నాయి. బాధ్యత కలిగిన పౌరులుగా మనం కూడా సహకరించాల్సిందే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: