ఈ మోసాలకి హద్దు లేదురా నాయన. ఎన్నో  అనునిత్యం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ మోసగాడు మాత్రం మోసగాళ్ళకే మొగుడులా ఉన్నాడు. వీడి కధ తెలిస్తే షాక్ అవ్వక తప్పదు. పేరు మార్చుకుని, అకౌంట్లు మార్చుకుని అమ్మాయిలతో మాట్లాడుతూ వరస కలుపుతున్నారు. ట్రాప్ చేసి డబ్బు గుంజుతున్నాడు. అనేక ఊర్లు మారి ఈ మోసగాడు ఇదే ఉద్యోగంగా సాగిస్తున్నాడు.

 

ఇటీవలే వెలుగులోకి వచ్చిన ఈ మాటకారి వంశి కృష్ణ యువతులని ఆకర్షించడమే ప్రధమ ధ్యేయం. తనకి ఉన్న ఆంగ్ల పరిజ్ఞానం తో మాట్లాడి నమ్మిస్తున్నాడు. ఆంగ్లం లో అనర్గళంగా మాట్లాడగలడు ఈ మోసగాడు. ఉద్యోగం, ప్రాజెక్ట్, వ్యాపారం అంటూ ఇతగాడు నేరానికి పాల్పడతాడు. ఇలా మాటలతో మాయ చేసి అందినంత దోచేసుకుంటాడు. ఎన్నో చూసి ఉంటాం  కానీ ఇది మాత్రం చాల కొత్త రకం.

 

 

బీటెక్ ని మధ్యలో వదిలేసి స్వస్థలం రాజమండ్రి నుండి హైదరాబాద్ వెళ్లి పోయాడు. ఆ తర్వాత ఫేస్బుక్ లో అమ్మాయిలతో మాటలు కలిపి ఉద్యోగం ఇప్పిస్తాను వంటివి చెబుతూ డబ్బులు లాక్కుంటాడు.  ఇతని పేరు హర్ష వర్ధన్ కానీ వంశి కృష్ణ పేరుతో మోసాలు చేస్తాడు. కేవలం సామాన్య ఆడపిల్లలు మాత్రమే కాక ప్రముఖుల కుమార్తెలు కూడా ఉన్నారని చెప్పారు పోలీసులు.

 

అయితే తాజాగా రెండు రోజుల క్రితమే ఒక యువతీ రూ. 8 .5 లక్షలు పోగొట్టుకుని పోలీసులకి ఫిర్యాదు చేసింది. అయితే మాట్లాడి క్లోస్ అయ్యి డబ్బు దోచుకున్నాడు. ఈ వంశి కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు ఇష్టం వచ్చినప్పుడు ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు ఇలా అనేక ప్రాంతాల్లో తిరిగి మోసాలు చేస్తాడట. అప్పట్లో ఇతనికి సుష్మిత అనే అమ్మాయి తో పరిచయం అయింది. ఆమె ఫేస్బుక్ నుండి వల్ల ఫ్రెండ్స్ తో స్నేహంగా మాట్లాడి ఉద్యోగం వంశి ఇప్పిస్తాడు అని నెంబర్ ఇచ్చాడు. ఇలా డబ్బులు దోచుకుని అనేక మోసాలు చేసాడు.తాజాగా  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: