కరోనా వైరస్ తీవ్రత ఇప్పుడు ప్రపంచాన్ని ఆందోళన కు గురి చేస్తుంది అనే చెప్పవచ్చు. దాదాపు అన్ని దేశాలకు ఈ కరోనా వైరస్ విస్తరించింది. ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న కరోనా వైరస్ ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతుంది. ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే దాని వ్యాప్తి అదుపులోకి వచ్చే అవకాశాలు కనపడటం లేదు అనే చెప్పాలి. ఇది పక్కన పెడితే ఇప్పుడు బయటకు వస్తున్న కొన్ని విషయాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కరోనా వైరస్ చాలా మంది ప్రముఖులకు అత్యంత వేగంగా సోకింది. 

 

ఇటీవల లండన్ నుంచి వచ్చిన బాలీవుడ్ స్టార్ సింగర్ కొనికా కపూర్ కి కూడా కరోనా వైరస్ ఉంది. అలాగే ఆమె ఇచ్చిన పార్టీలో పాల్గొన్న అన్ని పార్టీల ఎంపీలకు కరోనా వైరస్ సోకింది. దీనితో ఇప్పుడు కరోనా వైరస్ ఎంత మందికి సోకింది అనేది అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే ఇప్పుడు కరోనా వైరస్ కొంత మంది క్రికెటర్లకు కూడా సోకినట్టు తెలుస్తుంది. ప్రధానంగా స్కాట్ ల్యాండ్ సహా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ దేశాల క్రికెటర్లకు ఈ వ్యాధి సోకినట్టు తెలుస్తుంది. ఒక క్రికెటర్ కి కరోనా వైరస్ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. 

 

అలాగే మన సరిహద్దు దేశం పాకిస్తాన్ లో కూడా కరోనా వైరస్ విస్తరించింది. అక్కడ ముగ్గురు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుత౦ అక్కడ కరోనా కేసుల సంఖ్య దాదాపు వంద వరకు ఉన్నట్టు సమాచారం. ఇక క్రికెటర్ల నుంచి సామాన్యులకు సోకే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కొంత మంది క్రికెటర్లు ఇటీవల కొన్ని పార్టీలు చేసుకున్నారు. వారికి కూడా కరోనా వైరస్ సోకింది అని అధికారులు భావించి పరిక్షలు చేస్తున్నారు. జన సమ్మర్ధ ప్రాంతాల్లో ఉండవద్దు అని చెప్పినా సరే ఎవరూ వినడం లేదు ఇప్పుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: