కరోనా వైరస్ ఇతర దేశాలతో సహా భారతదేశం లోని అన్ని ప్రాంతాలలో విస్తరిస్తూ అందరికీ అనేక ఇబ్బందులను కలగజేస్తోంది. మన తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 18 కరోనా కేసులు నమోదవ్వగా... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు కేసులు నమోదయ్యాయి. దాంతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తక్షణమే అప్రమత్తమై కరోనా వైరస్ సంక్రమణ ని పూర్తిస్థాయిలో నిరోధించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు.




షాపింగ్ మాల్స్, థియేటర్స్, విద్యా సంస్థలను బంద్ చేయడంతో పాటు పెళ్లి మండపాలను కూడా మూసివేశారు. అయితే కొంత మంది మాత్రం తమ పెళ్లి ముహూర్తాలును వాయిదా వేసుకోకుండా ఇంతకుముందు పెట్టుకున్న ముహూర్తాలకే తమ పెళ్ళిళ్ళు కానిచ్చేస్తున్నారు. ఐతే తాజాగా కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని మెట్‌పల్లీ పట్టణంలో ఓ వివాహం జరిగి వార్తల్లోకెక్కింది.




వివరాలు తెలుసుకుంటే... మెట్‌పల్లీ పట్టణానికి చెందిన బెజ్జారపు ప్రవీణ్ కి -లక్ష్మీ కి పెళ్లి సంబంధం కుదరగా... మార్చి 20వ తేదీన వీళ్ళిద్దరికి పెళ్ళి ముహూర్తం నిశ్చయించారు పెద్దలు. కానీ కరోనా వైరస్ గుంపులు గుంపులుగా హాజరవుతున్న పెళ్లి మండపాల్లో వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుందని ప్రభుత్వాలు చెబుతుండడంతో చాలా పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. కానీ మెట్‌పల్లీ వరుడు ప్రవీణ్ మాత్రం తన పెళ్లిని వాయిదా వేసుకోలేదు. బదులుగా కొంతమంది డాక్టరును సంప్రదించి ఏ ఏ జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వైరస్ వ్యాప్తి ని అరికట్టగలమో తెలుసుకున్నాడు. ఆ తర్వాత తాను తెలుసుకున్న జాగ్రత్తలను ఏకంగా తన పెళ్లి పత్రికల లోనే ప్రచురించాడు.




తన వివాహానికి విచ్చేస్తున్న ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని లేకపోతే అనుమతించబోమని పెళ్లి పత్రికలో ప్రచురించాడు. దాంతో మార్చి 20వ తేదీన స్థానిక లిమ్రా ఫంక్షన్ హాల్ లో జరిగిన వివాహంలో అయ్యగార్లు, బంధుమిత్రులు, వధూవరులు ఇలా ప్రతి ఒక్కరు మాస్కులతోనే దర్శనమిచ్చారు. ఐతే ప్రస్తుతం ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఏది ఏదైనా ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్ మన దేశ ప్రజలను ఇంతగా ఇబ్బంది పెట్టడం అందర్నీ విస్తుపోయేలా చేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: