ప్రస్తుతం దేశంలో కరోనా ప్రభావం ఉందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ కరోనా వైరస్ ని అరికట్టేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు.  నలుగురు ఓ చోట చేరితే కరోనా (కోవిడ్‌-19) వైరస్‌ ప్రబలే ప్రమాదం ఉన్నందున వీలైనంత మేరకు గుమికూడే పరిస్థితి లేకుండా చూడాలని ప్రభుత్వం వెల్లడించింది. దాంతో కొన్ని ప్రాంతాల్లో తప్ప మిగతా చోట్ల ఇప్పటికీ అవి కిటకిటలాడుతూనే ఉన్నాయి. సమోసాలు తింటూ చాయ్‌ బిస్కెట్లు లాగించే వారితో కేఫ్‌లు నిండుగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ పాతనగరం పరిధిలో పరిస్థితి ఎప్పటిలాగే ఉంది.  ఎక్కువ జన సందడి ఉన్న ప్రదేశాల్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో డీఆర్ఎస్‌ సిబ్బంది క్రిమి సంహారక మందు స్ప్రే చేస్తున్నారు. ప్రజలు అధికంగా ఉండే బస్‌ స్టాండులు, మెట్రో స్టేషన్ల వద్ద పార్కుల్లో ఈ పనులు కొనసాగుతున్నాయి. కరోనా రాకాసి నగరాన్ని బెంబేలెత్తిస్తోంది.

 

ఒక్కొక్కరుగా కోవిడ్‌ లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతుండటంతో గ్రేటర్‌వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. కరోనాను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని ప్రభుత్వాలు చెబుతున్నాయి.  ఈ నేపథ్యంలో పాఠశాలలు, మాల్స్, థియేటర్లు, బార్ షాపులు, క్లబ్ అన్నీ మూసివేశారు.  హైకోర్టు ఆదేశాలతో పదో తరగతి పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. రేపు దేశ వ్యాప్తంగా ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని సాక్షాత్తు ప్రధాని మోదీ తెలిపిన విషయం తెలిసిందే.  హైదరాబాద్ ఎల్బీనగర్ చింతల్ కుంట దగ్గర కరోనా అనుమానితుడు కలకలం రేపాడు. కరోనా అనుమానితుడు నాని భీమవరం బస్సు ఎక్కేందుకు వెళ్లాడు. నాని చేతికి కరోనా స్టాంప్ ఉండటంతో ఆర్టీసీ అధికారులు నిలదీశారు.

 

అతడు దుబాయ్ నుంచి ముంబై వచ్చాడు. ముంబై ఐసోలేషన్ వార్డు నుంచి తప్పించుకుని హైదరాబాద్ వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా అక్కడ కలకలం రేగింది. మరోవైపు కరోనా ని కట్టడి చేసేందుకు జీహెచ్ఎం సీ శాయశక్తులా ప్రయత్నాలు మొదలు పెట్టింది..  ఇందుకు సంబంధించిన ఫొటోలను తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. తెలంగాణలో కరోనా కేసులు పెరిగిపోతోన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో క్రిమి సంహారక మందు స్ప్రే చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: